Eṟamgavu gaaga neevedirim jesina melu

ఎఱఁగవు గాక నీవెదిరిఁ జేసిన మేలు
Language

(॥పల్లవి॥)
ఎఱఁగవు గాక నీవెదిరిఁ జేసిన మేలు
వెఱపేల పొదుగక విడుచునా నిన్నును

(॥ఎఱఁ॥)
సుదతి! పతిఁగోపంచి చూచినదోస మెల్ల
మదమై నీచెక్కులఁ జెమట గారీని
చెదర నాతని జంకించినకర్మముననె పో
నుదుటికాంతుల నెల్లనూ గరులై పొదిగె

(॥ఎఱఁ॥)
అలిగి ఆవలి మోమైనవల్లద మెల్ల
కులిగి చన్నులవేఁగై కూడఁజొచ్చెనే
బలిమి నాతనిఁ జేతఁ బగచాటినపగెల్ల
పెలుచు వాఁడిగోళ్లై బిరుదులు గక్కెను

(॥ఎఱఁ॥)
కడిఁగి శ్రీవేంకటేశుఁ గడవ నాడినముంపు
వొడికెమై నీపెదవుల నంటెనే
కడు నీవాతని నిట్టె కలసిన కలయిక
చిడుముడి నీరతి చిత్తమున నిండెనే

(||pallavi||)
ĕṟam̐gavu gāga nīvĕdirim̐ jesina melu
vĕṟabela pŏdugaga viḍusunā ninnunu

(||ĕṟam̐||)
sudadi! padim̐gobaṁchi sūsinadosa mĕlla
madamai nīsĕkkulam̐ jĕmaḍa gārīni
sĕdara nādani jaṁkiṁchinagarmamunanĕ po
nuduḍigāṁtula nĕllanū garulai pŏdigĕ

(||ĕṟam̐||)
aligi āvali momainavallada mĕlla
kuligi sannulavem̐gai kūḍam̐jŏchchĕne
balimi nādanim̐ jedam̐ bagasāḍinabagĕlla
pĕlusu vām̐ḍigoḽlai birudulu gakkĕnu

(||ĕṟam̐||)
kaḍim̐gi śhrīveṁkaḍeśhum̐ gaḍava nāḍinamuṁpu
vŏḍigĕmai nībĕdavula naṁṭĕne
kaḍu nīvādani niṭṭĕ kalasina kalayiga
siḍumuḍi nīradi sittamuna niṁḍĕne