ఎఱఁగవితని చంద మిట్టివాఁడనుచు నింతి
(॥పల్లవి॥)
ఎఱఁగవితని చంద మిట్టివాఁడనుచు నింతి
తెఱవల నీమీఁదఁ దేనోపుఁ జుమ్మీ
(॥ఎఱఁగ॥)
రంగుమీరిన మంచిరత్నాలు దాచిన నీ-
వుంగరాలచేతఁ బాదమొత్తకువవ్మ
అంగన వుట్టెనుఁ బాదమంటి శిలను దొల్లి
కంగి నీకుఁ బ్రతిమొన గడియించీఁ జుమ్మీ
(॥ఎఱఁగ॥)
కొమ్మ నీదు వాలారుగోళ్ళ నితనికిని
యిమ్ములఁ దొడలు సోఁకనియ్యకు వమ్మా
దొమ్ముల సిరుల గోరఁ దొడనింతిఁ బుట్టించె
కమ్మర నీకు నిట్టెకలిగించీఁ జుమ్మీ
(॥ఎఱఁగ॥)
నొక్కుచుఁ జెమటల పానుపున వేంకటపతి-
నుక్కున నీచనుఁగొండలొత్తకువమ్మా
పక్కనను గొండవేసి పానుపుజలది దచ్చె
చక్కని తరుణి నిట్టె సడిఁబెట్టీఁ జుమ్మీ
(||pallavi||)
ĕṟam̐gavidani saṁda miṭṭivām̐ḍanusu niṁti
tĕṟavala nīmīm̐dam̐ denobum̐ jummī
(||ĕṟam̐ga||)
raṁgumīrina maṁchiratnālu dāsina nī-
vuṁgarālasedam̐ bādamŏttaguvavma
aṁgana vuṭṭĕnum̐ bādamaṁṭi śhilanu dŏlli
kaṁgi nīgum̐ bradimŏna gaḍiyiṁchīm̐ jummī
(||ĕṟam̐ga||)
kŏmma nīdu vālārugoḽḽa nidanigini
yimmulam̐ dŏḍalu som̐kaniyyagu vammā
dŏmmula sirula goram̐ dŏḍaniṁtim̐ buṭṭiṁchĕ
kammara nīgu niṭṭĕgaligiṁchīm̐ jummī
(||ĕṟam̐ga||)
nŏkkusum̐ jĕmaḍala pānubuna veṁkaḍabadi-
nukkuna nīsanum̐gŏṁḍalŏttaguvammā
pakkananu gŏṁḍavesi pānubujaladi dachchĕ
sakkani taruṇi niṭṭĕ saḍim̐bĕṭṭīm̐ jummī