Eṟamgavaa neevemainaa yinnidaa nerubarivi

ఎఱఁగవా నీవేమైనా యిన్నిటా నేరుపరివి
Language

(॥పల్లవి॥)
ఎఱఁగవా నీవేమైనా యిన్నిటా నేరుపరివి
జఱయుచు నవ్వఁగాను సాదింతు రటవే

(॥ఎఱ॥)
సముకాన నాతడు సన్నలు సేయఁగానే
తమకించి మాటాడఁ దగవౌ నటే
చెమరించు కొంటాను చేరి ప్రియాలు చెప్పఁగా
బొమముడి జంకెనలు పొందౌనటే

(॥ఎఱ॥)
యియ్యకోలుగా నీకు నిచ్చకము సేయఁగానే
సయ్యాటానఁ బెనఁగఁగ సంగతౌనటే
నెయ్యముతో గాసిపడి నీదిక్కు చూడగాను
కొయ్యతనానఁ గొసరు గూడునటవే

(॥ఎఱ॥)
మంతనాల నాతఁడు మర్మములు ముట్టఁగాను
పంతములు నెరఁపగ బాగౌనటే
యింతలోనె శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ గూడె
చెంతనుండి సిగ్గువడఁ జెల్లునటవే

(||pallavi||)
ĕṟam̐gavā nīvemainā yinniḍā nerubarivi
jaṟayusu navvam̐gānu sādiṁtu raḍave

(||ĕṟa||)
samugāna nādaḍu sannalu seyam̐gāne
tamagiṁchi māḍāḍam̐ dagavau naḍe
sĕmariṁchu kŏṁṭānu seri priyālu sĕppam̐gā
bŏmamuḍi jaṁkĕnalu pŏṁdaunaḍe

(||ĕṟa||)
yiyyagolugā nīgu nichchagamu seyam̐gāne
sayyāḍānam̐ bĕnam̐gam̐ga saṁgadaunaḍe
nĕyyamudo gāsibaḍi nīdikku sūḍagānu
kŏyyadanānam̐ gŏsaru gūḍunaḍave

(||ĕṟa||)
maṁtanāla nādam̐ḍu marmamulu muṭṭam̐gānu
paṁtamulu nĕram̐paga bāgaunaḍe
yiṁtalonĕ śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐ gūḍĕ
sĕṁtanuṁḍi sigguvaḍam̐ jĕllunaḍave