ఎఱఁగవా నాచేత నింతేశాడించుకోనేల
(॥పల్లవి॥)
ఎఱఁగవా నాచేత నింతేశాడించుకోనేల
మఱచిన పనులకు మగిడి చూడనేలా
(॥॥)
పైకొని నాతో నీవు బాసలు సేయఁగనేల
నీకు నిజమే కలితే నిష్టూరమేల
యేకమైన పొందులకు యెడమాటలాడనేల
సాకిరిలేని పనికి సాదించనేల
(॥॥)
కొన్నది కోలై నందుకు కొలఁది వెట్టిఁగనేల
చిన్ననాటి సుద్దులకు సిగ్గులేల
అన్నిటా నేర్పరి వైతే నంతనీకు లోఁగనేల
నిన్నటి చీఁకటికి నేఁడు దీపమేలా
(॥॥)
వేడుకకాఁడవు నీవు వెఱపులు మరి యేల
కూడితివి నన్ను నిఁకఁ గొసర నేల
పాడితో నడచే నీకు పంతములు మరి యాల
వాడికె శ్రీవేంకటేశ వంకలొత్తనేలా
(||pallavi||)
ĕṟam̐gavā nāseda niṁteśhāḍiṁchugonela
maṟasina panulagu magiḍi sūḍanelā
(||||)
paigŏni nādo nīvu bāsalu seyam̐ganela
nīgu nijame kalide niṣhṭūramela
yegamaina pŏṁdulagu yĕḍamāḍalāḍanela
sāgirileni panigi sādiṁchanela
(||||)
kŏnnadi kolai naṁdugu kŏlam̐di vĕṭṭim̐ganela
sinnanāḍi suddulagu siggulela
anniḍā nerbari vaide naṁtanīgu lom̐ganela
ninnaḍi sīm̐kaḍigi nem̐ḍu dībamelā
(||||)
veḍugagām̐ḍavu nīvu vĕṟabulu mari yela
kūḍidivi nannu nim̐kam̐ gŏsara nela
pāḍido naḍase nīgu paṁtamulu mari yāla
vāḍigĕ śhrīveṁkaḍeśha vaṁkalŏttanelā