Eṟamgavaa naa manasu yinnidaa neevu

ఎఱఁగవా నా మనసు యిన్నిటా నీవు
Language

(॥పల్లవి॥)
ఎఱఁగవా నా మనసు యిన్నిటా నీవు
జఱసేనా నీ మోవి చవిచూచేఁగాకా

(॥ఎఱఁ॥)
పెనఁగేటిదాననా ప్రియము లేల చేప్పేవు
వినయముతోనే మాఁట వినేఁగాక
చెనకేటిదాననా చేతు లేల పట్టేవు
మొనసి నీ పాదాలకు మొక్కేఁగాక

(॥ఎఱఁ॥)
జంకించదాననా సన్న లేల సేసేవు
కొంకక నీ చేఁత లియ్యకొనేఁగాక
మంకుచూపేదాననా మరేల వేఁడుకొనేవు
వుంకువగాఁ జనుగుబ్బలొత్తి పట్టేఁగాకా

(॥ఎఱ॥)
వొల్లకుండేదాననా వొడివట్టేల తీసేవు
చెల్లుబడిగా నీ సేవసేసేఁగాక
యిల్లిదె శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
మల్లాడక నీ రతులు మరిగేఁగాకా

(||pallavi||)
ĕṟam̐gavā nā manasu yinniḍā nīvu
jaṟasenā nī movi savisūsem̐gāgā

(||ĕṟam̐||)
pĕnam̐geḍidānanā priyamu lela seppevu
vinayamudone mām̐ṭa vinem̐gāga
sĕnageḍidānanā sedu lela paṭṭevu
mŏnasi nī pādālagu mŏkkem̐gāga

(||ĕṟam̐||)
jaṁkiṁchadānanā sanna lela sesevu
kŏṁkaga nī sem̐ta liyyagŏnem̐gāga
maṁkusūbedānanā marela vem̐ḍugŏnevu
vuṁkuvagām̐ janugubbalŏtti paṭṭem̐gāgā

(||ĕṟa||)
vŏllaguṁḍedānanā vŏḍivaṭṭela tīsevu
sĕllubaḍigā nī sevasesem̐gāga
yillidĕ śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
mallāḍaga nī radulu marigem̐gāgā