ఎఱఁగవా మీఁదటెత్తు ఇంతేసి వచ్చీనని
(॥పల్లవి॥)
ఎఱఁగవా మీఁదటెత్తు ఇంతేసి వచ్చీనని
తఱి నాకె నీకు బుద్ది తగఁ జెప్పదాయనా
(॥॥)
యిప్పుడు నామాటలకు నింత వోరిచేవాఁడవు
అప్పుడాపె రాఁగా రాకుమనరాదా
తెప్పిరిల నాయలుక దేర్చేవాఁడవు నిన్నాపె
వొప్పుగాఁ గొంగు వట్టితే నోపననరాదా
(॥॥)
కోటియానలిఁకఁ బెట్టుకొనేవాఁడవటు యాపె
వూటమోవికి నోరొగ్గకుండరాదా
మూటకట్టుగా వేఁడుక మొక్కేవాఁడ వీచేతులు
చాటి యాపె చన్నులపైఁ జాఁచకుండరాదా
(॥॥)
పరగ శ్రీవేంకటేశ బలిమి నన్నేలితివి
బెరయక యాపెతోను పెనఁగరాదా
మరిగిన అలమేలుమంగనని మన్నించితి-
విరవుగా నాపె నిట్టే యీడకుఁ దేరాదా
(||pallavi||)
ĕṟam̐gavā mīm̐daḍĕttu iṁtesi vachchīnani
taṟi nāgĕ nīgu buddi tagam̐ jĕppadāyanā
(||||)
yippuḍu nāmāḍalagu niṁta vorisevām̐ḍavu
appuḍābĕ rām̐gā rāgumanarādā
tĕppirila nāyaluga dersevām̐ḍavu ninnābĕ
vŏppugām̐ gŏṁgu vaṭṭide nobananarādā
(||||)
koḍiyānalim̐kam̐ bĕṭṭugŏnevām̐ḍavaḍu yābĕ
vūḍamovigi norŏggaguṁḍarādā
mūḍagaṭṭugā vem̐ḍuga mŏkkevām̐ḍa vīsedulu
sāḍi yābĕ sannulabaim̐ jām̐saguṁḍarādā
(||||)
paraga śhrīveṁkaḍeśha balimi nannelidivi
bĕrayaga yābĕdonu pĕnam̐garādā
marigina alamelumaṁganani manniṁchidi-
viravugā nābĕ niṭṭe yīḍagum̐ derādā