ఎఱఁగవా ఆఁడుఁదగ వింతిరో నీవు
(॥పల్లవి॥)
ఎఱఁగవా ఆఁడుఁదగ వింతిరో నీవు
తఱవాతి పనులకుఁ దమకించవే
(॥ఎఱఁగ॥)
కొనగోర నూఁదితేనే కోపగించుకొనకువే
చనవులు చేసుకొని సమ్మతించవే
మనసు చూచీనింతే మచ్చరించవలదే
ననుపున సెలవుల నవ్వు నవ్వవే
(॥ఎఱఁగ॥)
గుబ్బచన్నులంటితేను గొణఁగి తిట్టకువే
అబ్బురము చేసుకొని ఆదరించవే
వుబ్బులు రేఁచీనింతే వొరటు చూపకువే
నిబ్బరాన వీడెమిచ్చి నేరుపు మెఱయవే
(॥ఎఱఁగ॥)
చెక్కు నొక్కి కూడితేను సిగ్గులు వడకువే
మిక్కిలి నీ తల యెత్తి మెచ్చు మెచ్చవే
యిక్కువ శ్రీవేంకటేశుఁ డేలె నింత వీఁగకువే
చొక్కించి దప్పులు దేర్చి జోడు వాయకువే
(||pallavi||)
ĕṟam̐gavā ām̐ḍum̐daga viṁtiro nīvu
taṟavādi panulagum̐ damagiṁchave
(||ĕṟam̐ga||)
kŏnagora nūm̐didene kobagiṁchugŏnaguve
sanavulu sesugŏni sammadiṁchave
manasu sūsīniṁte machchariṁchavalade
nanubuna sĕlavula navvu navvave
(||ĕṟam̐ga||)
gubbasannulaṁṭidenu gŏṇam̐gi tiṭṭaguve
abburamu sesugŏni ādariṁchave
vubbulu rem̐sīniṁte vŏraḍu sūbaguve
nibbarāna vīḍĕmichchi nerubu mĕṟayave
(||ĕṟam̐ga||)
sĕkku nŏkki kūḍidenu siggulu vaḍaguve
mikkili nī tala yĕtti mĕchchu mĕchchave
yikkuva śhrīveṁkaḍeśhum̐ ḍelĕ niṁta vīm̐gaguve
sŏkkiṁchi dappulu dersi joḍu vāyaguve