ఎఱఁగరాదా నీకు నేఁటికింత సేసేవు
(॥పల్లవి॥)
ఎఱఁగరాదా నీకు నేఁటికింత సేసేవు
చిఱునవ్వుతోడ లోలో సిగ్గులు వడఁగను
(॥ఎఱఁగ॥)
మనసె కరఁగీపెను మాటలాడవలెనా
తనువులోపలి మేలు దైవారుఁగాక
పనివడి నీవెల పలుకుమనేవాపెను
తనుఁదానె మోము తప్పక చూడఁగను
(॥ఎఱఁగ॥)
చేరి పానుపుపైనుంటే చెనకఁగ వలెనా
తారుకాణై పులకలు దాఁచవు గాక
సారెకు నీవాపెనేల సరసమాడుమనేవు
వూరకే నీమీఁదఁ దాను వొరఁగుకుండఁగను
(॥ఎఱఁగ॥)
కందువ సేసవెట్టితేఁ గాఁగిలించవలెనా
చిందుచు మోవితేనెలు చిప్పిలుఁగాక
యిందునె శ్రీ వేంకటేశ యింకేమి సేయుమనేవు
ముందె కూడి నీవురమునఁ దానుండఁగను
(||pallavi||)
ĕṟam̐garādā nīgu nem̐ṭigiṁta sesevu
siṟunavvudoḍa lolo siggulu vaḍam̐ganu
(||ĕṟam̐ga||)
manasĕ karam̐gībĕnu māḍalāḍavalĕnā
tanuvulobali melu daivārum̐gāga
panivaḍi nīvĕla palugumanevābĕnu
tanum̐dānĕ momu tappaga sūḍam̐ganu
(||ĕṟam̐ga||)
seri pānububainuṁṭe sĕnagam̐ga valĕnā
tārugāṇai pulagalu dām̐savu gāga
sārĕgu nīvābĕnela sarasamāḍumanevu
vūrage nīmīm̐dam̐ dānu vŏram̐guguṁḍam̐ganu
(||ĕṟam̐ga||)
kaṁduva sesavĕṭṭidem̐ gām̐giliṁchavalĕnā
siṁdusu movidenĕlu sippilum̐gāga
yiṁdunĕ śhrī veṁkaḍeśha yiṁkemi seyumanevu
muṁdĕ kūḍi nīvuramunam̐ dānuṁḍam̐ganu