Eṟamgaraa nee suddulu yimtu lellaanu

ఎఱఁగరా నీ సుద్దులు యింతు లెల్లాను
Language

(॥పల్లవి॥)
ఎఱఁగరా నీ సుద్దులు యింతు లెల్లాను
అఱిముఱి దొడ్డివారమని మమ్ము నవ్వేవు

(॥॥)
గొల్లవాఁడవై తిరిగి కోరి నీవు మరికదా
వెల్లవిరి మధురలొ వెలవెట్టితి
పల్లదపు సేఁతలతొ పసులఁ గాచికదా
యెల్లవారికిని మరి యేలికవైతివి

(॥॥)
బెరసి యశొదకు బిడ్డఁడవై వుండి కదా
పొరలి దేవకి నిజపుత్రుఁడవైతి
వరుసతొ రేపల్లె వాడల దిరిగి కదా
నరపతివై ద్వారకా నగరమెక్కితివి

(॥॥)
మందలోని సతులను పొంది పొంది మరికదా
అంది పదారువేలఁ బెండ్లాడితివి
యిందునె శ్రీ వేంకటేశ యిటు నన్నుఁ గూడికదా
దిందుపడి శ్రీ వేంకటాద్రి పై నిలిచితివి

(||pallavi||)
ĕṟam̐garā nī suddulu yiṁtu lĕllānu
aṟimuṟi dŏḍḍivāramani mammu navvevu

(||||)
gŏllavām̐ḍavai tirigi kori nīvu marigadā
vĕllaviri madhuralŏ vĕlavĕṭṭidi
palladabu sem̐taladŏ pasulam̐ gāsigadā
yĕllavārigini mari yeligavaidivi

(||||)
bĕrasi yaśhŏdagu biḍḍam̐ḍavai vuṁḍi kadā
pŏrali devagi nijabutrum̐ḍavaidi
varusadŏ reballĕ vāḍala dirigi kadā
narabadivai dvāragā nagaramĕkkidivi

(||||)
maṁdaloni sadulanu pŏṁdi pŏṁdi marigadā
aṁdi padāruvelam̐ bĕṁḍlāḍidivi
yiṁdunĕ śhrī veṁkaḍeśha yiḍu nannum̐ gūḍigadā
diṁdubaḍi śhrī veṁkaḍādri pai nilisidivi