ఎఱఁగరా దేవులౌత యేల దాఁచేవు
(॥పల్లవి॥)
ఎఱఁగరా దేవులౌత యేల దాఁచేవు
మెఱయ నాకె మనసు మెప్పించరాదా
(॥॥)
ముచ్చటాడవలెనంటా ముంగిటికి వచ్చె నాకె-
నెచ్చరించి యేల లోనియింటి కంపేవు
వచ్చివచ్చి తొంగిచూచి వాఁటముగా నవ్వీ నీతో
పచ్చడమేల కప్పేవు పై పై నీవు
(॥॥)
వూడిగము సేసేనంటా వొద్దనే కూచుండె నాకె
పాడితోడ నీవేఁటికిఁ బని చెప్పేవు
వీడెము చేతఁ బట్టుక వేళలుగాచుకున్నది
వాడికెఁ దెరలో నెంతవడి మూనేవు
(॥॥)
కందువఁ గూడేనంటా కైదండ ఇచ్చె నా కె
ఆందముగా మెచ్చి యంత ఆసవెట్టేవు
గందమిచ్చి శ్రీ వేంకటేశ పెండ్లాడె నిన్ను
యిందె నన్నేలితివి యేకాంత మేలాడేవు
(||pallavi||)
ĕṟam̐garā devulauda yela dām̐sevu
mĕṟaya nāgĕ manasu mĕppiṁcharādā
(||||)
muchchaḍāḍavalĕnaṁṭā muṁgiḍigi vachchĕ nāgĕ-
nĕchchariṁchi yela loniyiṁṭi kaṁpevu
vachchivachchi tŏṁgisūsi vām̐ṭamugā navvī nīdo
pachchaḍamela kappevu pai pai nīvu
(||||)
vūḍigamu sesenaṁṭā vŏddane kūsuṁḍĕ nāgĕ
pāḍidoḍa nīvem̐ṭigim̐ bani sĕppevu
vīḍĕmu sedam̐ baṭṭuga veḽalugāsugunnadi
vāḍigĕm̐ dĕralo nĕṁtavaḍi mūnevu
(||||)
kaṁduvam̐ gūḍenaṁṭā kaidaṁḍa ichchĕ nā kĕ
āṁdamugā mĕchchi yaṁta āsavĕṭṭevu
gaṁdamichchi śhrī veṁkaḍeśha pĕṁḍlāḍĕ ninnu
yiṁdĕ nannelidivi yegāṁta melāḍevu