ఎఱఁగను నేను నీతో యెదురుమాటలాడను
(॥పల్లవి॥)
ఎఱఁగను నేను నీతో యెదురుమాటలాడను
తఱి నీవే యెంచుకొని దయసేయవయ్యా
(॥ఎఱఁ॥)
చొప్పున నీవు నన్ను చూచితే నేనూఁ జూడక
అప్పుడు దలవంచిన దపరాధము
చిప్పిలి ఆడుదాననై సిగ్గువడితి నిందుకు
తప్పేమిటఁ దీరు నీవే దయసేయవయ్యా
(॥ఎఱఁ॥)
నిగిడి నీవు నవ్వఁగ నిండుసబలోన నేను
నగకవుండినదే నానేరమి(ము)
తగిలి కన్నెగనక దంటతన మొల్లనైతి
తగిన బుద్దులు చెప్పి దయఁజూడవయ్యా
(॥ఎఱఁ॥)
గక్కన శ్రీ వేంకటేశ కాఁగిట నీవు గూడఁగా
యిక్కువలు గరఁగిన దిదియే తప్పు
మొక్కి యలమేల్మంగను మోహములెల్లా నించితి
తక్కక నన్ను మన్నించి దయఁజూడవయ్యా
(||pallavi||)
ĕṟam̐ganu nenu nīdo yĕdurumāḍalāḍanu
taṟi nīve yĕṁchugŏni dayaseyavayyā
(||ĕṟam̐||)
sŏppuna nīvu nannu sūside nenūm̐ jūḍaga
appuḍu dalavaṁchina dabarādhamu
sippili āḍudānanai sigguvaḍidi niṁdugu
tappemiḍam̐ dīru nīve dayaseyavayyā
(||ĕṟam̐||)
nigiḍi nīvu navvam̐ga niṁḍusabalona nenu
nagagavuṁḍinade nānerami(mu)
tagili kannĕganaga daṁṭadana mŏllanaidi
tagina buddulu sĕppi dayam̐jūḍavayyā
(||ĕṟam̐||)
gakkana śhrī veṁkaḍeśha kām̐giḍa nīvu gūḍam̐gā
yikkuvalu garam̐gina didiye tappu
mŏkki yalamelmaṁganu mohamulĕllā niṁchidi
takkaga nannu manniṁchi dayam̐jūḍavayyā