ఎఱఁగను మీరింతేసి యిద్దరి మాలో సన్నలు
(॥పల్లవి॥)
ఎఱఁగను మీరింతేసి యిద్దరి మాలో సన్నలు
వొఱపులు చూపనేల వున్నట్టే వుండరే
(॥ఎఱఁ॥)
దయగల విభునికి తరుణులెల్లా సరే
నయము రేఁచుక మీరు నవ్వేరు గాని
క్రియ దెలుసుక నేము కినియ మాతనితోడ
ప్రియముగల యాటది బిరుదులాడునా
(॥ఎఱఁ॥)
సారమైన జాణనికి సరసమెల్లా సరే
నేరుపులు పచరించి నిక్కేరు మీరు
తారుకాణై వుండఁగాను తప్పు లెంచ మాతనిపై
యీరీతి లోనైనచెలి యిచ్చాడక మానునా
(॥ఎఱఁ॥)
శ్రీ వేంకటపతికి చెణకులెల్లా సరే
వావులు సేసుక మీరు వదిఁ(డిఁ) బొందేరు
యీవేళ నన్నుఁ గూడె యితఁడు మీరు మెచ్చను
కైవసమయిన యింతి కడుఁ దమకించునా
(||pallavi||)
ĕṟam̐ganu mīriṁtesi yiddari mālo sannalu
vŏṟabulu sūbanela vunnaṭṭe vuṁḍare
(||ĕṟam̐||)
dayagala vibhunigi taruṇulĕllā sare
nayamu rem̐suga mīru navveru gāni
kriya dĕlusuga nemu kiniya mādanidoḍa
priyamugala yāḍadi birudulāḍunā
(||ĕṟam̐||)
sāramaina jāṇanigi sarasamĕllā sare
nerubulu pasariṁchi nikkeru mīru
tārugāṇai vuṁḍam̐gānu tappu lĕṁcha mādanibai
yīrīdi lonainasĕli yichchāḍaga mānunā
(||ĕṟam̐||)
śhrī veṁkaḍabadigi sĕṇagulĕllā sare
vāvulu sesuga mīru vadim̐(ḍim̐) bŏṁderu
yīveḽa nannum̐ gūḍĕ yidam̐ḍu mīru mĕchchanu
kaivasamayina yiṁti kaḍum̐ damagiṁchunā