Eṟamganivaaru gala rerumguvaaru galaru

ఎఱఁగనివారు గల రెరుఁగువారు గలరు
Language

(॥పల్లవి॥)
ఎఱఁగనివారు గల రెరుఁగువారు గలరు
యెఱుకతోనే నీవు ఇంత గేలిసేతురా

(॥ఎఱఁ॥)
మన్నింతువంటా నీతో మనవి విన్నవించితే
సన్నల నవ్వేవు నీవు సారెసారెకు
తిన్నఁగాఁ దప్పుగలిగితే దిద్దవలెఁగాక నీవు
యెన్నఁగ వింతులలోన నింత గేలిసేతురా

(॥ఎఱఁ॥)
వోరుత(తు?) వంటా నిన్ను వొడివట్టి కొసరితే
సారెసారె నవ్వేవు జారుఁగొంగుతో
నేరమి గలిగితేను నేరుపఁగవలెఁగాక
యీరీతి నిందరిలో నిఁత గేలిసేతురా

(॥ఎఱఁ॥)
చెందితినంటా నిన్నుఁ జెలంగి మెచ్చితేను
సందడి నవ్వు నవ్వేవు సారెసారెకు
విందుల శ్రీవేంకటగోవిందుఁడ నన్నే లితివి
యిందరిలో నారతుల నింత గేలిసేతురా

(||pallavi||)
ĕṟam̐ganivāru gala rĕrum̐guvāru galaru
yĕṟugadone nīvu iṁta gelisedurā

(||ĕṟam̐||)
manniṁtuvaṁṭā nīdo manavi vinnaviṁchide
sannala navvevu nīvu sārĕsārĕgu
tinnam̐gām̐ dappugaligide diddavalĕm̐gāga nīvu
yĕnnam̐ga viṁtulalona niṁta gelisedurā

(||ĕṟam̐||)
voruda(tu?) vaṁṭā ninnu vŏḍivaṭṭi kŏsaride
sārĕsārĕ navvevu jārum̐gŏṁgudo
nerami galigidenu nerubam̐gavalĕm̐gāga
yīrīdi niṁdarilo nim̐ta gelisedurā

(||ĕṟam̐||)
sĕṁdidinaṁṭā ninnum̐ jĕlaṁgi mĕchchidenu
saṁdaḍi navvu navvevu sārĕsārĕgu
viṁdula śhrīveṁkaḍagoviṁdum̐ḍa nanne lidivi
yiṁdarilo nāradula niṁta gelisedurā