ఎఱఁగనివానివలె యేలడిగే విటు నన్ను
(॥పల్లవి॥)
ఎఱఁగనివానివలె యేలడిగే విటు నన్ను-
నెఱవుగా నింతసేసి నీవే యెఱఁగవా
(॥ఎఱ॥)
చెంగట నీవు నాకుఁ జేయిసన్న సేయఁగాను
పొంగి చెమరించితి నప్పుడుగాదా
ముంగిటినీచూపు నాపై ముంచి ముంచి చల్లఁగాను
అంగపుసొమ్ములు బిగువైనది యెఱఁగవా
(॥ఎఱ॥)
మలసి నీవు నాతో మాఁటలు గడునాడఁగా
మొలు నూలు జారెను నీముందరఁగాదా
వలపులు చల్లి నీవు వాడికెనవ్వు నవ్వఁగా
పులకలు జాజుకొని పొదలె నెఱఁగవా
(॥ఎఱ॥)
గక్కన నీవు నన్నుఁ గాఁగిలించి కూడఁగాను
నెక్కొనెఁ గెంపులు మోవి నీవల్లఁగాదా
అక్కజపుశ్రీవేంకటాద్రిగోవిందరాజవు
మిక్కిలి రతులలో నీమేలు నీవెఱఁగవా
(||pallavi||)
ĕṟam̐ganivānivalĕ yelaḍige viḍu nannu-
nĕṟavugā niṁtasesi nīve yĕṟam̐gavā
(||ĕṟa||)
sĕṁgaḍa nīvu nāgum̐ jeyisanna seyam̐gānu
pŏṁgi sĕmariṁchidi nappuḍugādā
muṁgiḍinīsūbu nābai muṁchi muṁchi sallam̐gānu
aṁgabusŏmmulu biguvainadi yĕṟam̐gavā
(||ĕṟa||)
malasi nīvu nādo mām̐ṭalu gaḍunāḍam̐gā
mŏlu nūlu jārĕnu nīmuṁdaram̐gādā
valabulu salli nīvu vāḍigĕnavvu navvam̐gā
pulagalu jājugŏni pŏdalĕ nĕṟam̐gavā
(||ĕṟa||)
gakkana nīvu nannum̐ gām̐giliṁchi kūḍam̐gānu
nĕkkŏnĕm̐ gĕṁpulu movi nīvallam̐gādā
akkajabuśhrīveṁkaḍādrigoviṁdarājavu
mikkili radulalo nīmelu nīvĕṟam̐gavā