Eṟamganivaanivale nemi soosevu

ఎఱఁగనివానివలె నేమి చూచేవు
Language

(॥పల్లవి॥)
ఎఱఁగనివానివలె నేమి చూచేవు
జఱయక కెవ్మెూవి చవిచూపఁ దగదా

(॥॥)
యెదురుగా నిలుచుండి ఇంతి ప్రియములు చెప్పి
వదలుఁ దురుము కడువంచి మొక్కీని
సదరానఁ గొంగువట్టి జాణతనాలెల్ల నాడి
కదిసి యాకెమనసు గరఁగించఁదగదా

(॥॥)
కొలువు లట్టె చేసి కూరిములు పైనించి
చలువగాఁ బువ్వుల సేసలువెట్టీని
తలకొన నవ్వునవ్వి తతిఁ గుచగిరులంటి
లలిమీర మదనకళలు రేచఁదగదా

(॥॥)
అండ నుండి చెక్కు నొక్కి అంకెల సన్నలుచేసి
మెండుకొన్న వూడిగాన మెప్పించీని
దండితో నలమేల్మంగఁ దగిలి శ్రీ వేంకటేశ
నిండుకొనఁ గూడితివి నీవు మెచ్చఁదగదా

(||pallavi||)
ĕṟam̐ganivānivalĕ nemi sūsevu
jaṟayaga kĕvmĕూvi savisūbam̐ dagadā

(||||)
yĕdurugā nilusuṁḍi iṁti priyamulu sĕppi
vadalum̐ durumu kaḍuvaṁchi mŏkkīni
sadarānam̐ gŏṁguvaṭṭi jāṇadanālĕlla nāḍi
kadisi yāgĕmanasu garam̐giṁcham̐dagadā

(||||)
kŏluvu laṭṭĕ sesi kūrimulu painiṁchi
saluvagām̐ buvvula sesaluvĕṭṭīni
talagŏna navvunavvi tadim̐ gusagirulaṁṭi
lalimīra madanagaḽalu resam̐dagadā

(||||)
aṁḍa nuṁḍi sĕkku nŏkki aṁkĕla sannalusesi
mĕṁḍugŏnna vūḍigāna mĕppiṁchīni
daṁḍido nalamelmaṁgam̐ dagili śhrī veṁkaḍeśha
niṁḍugŏnam̐ gūḍidivi nīvu mĕchcham̐dagadā