Eṟamganivaamdavaa yemayyaa neevu

ఎఱఁగనివాఁడవా యేమయ్యా నీవు
Language

(॥పల్లవి॥)
ఎఱఁగనివాఁడవా యేమయ్యా నీవు
మఱవవచ్చునా మేలు మన్నింతురుగాక

(॥ఎఱఁ॥)
సరసములాడితేను సాకిరివెట్టుదురా
వొరసివొరసి నవ్వుదురుగాక
శిరసువట్టితేనే చేతుల బిగింతురా
కరఁగినమనసుతో కైకొందురుగాక

(॥ఎఱఁ॥)
తచ్చితచ్చి చూచితేను తలవంచుకొందురా
ఇచ్చగించి గక్కనఁ జేయిత్తురుగాక
పచ్చిమాటలాడితేను పరాకు సేయుదురా
అచ్చమైనచనుఁగొండ లంటుదురుగాక

(॥ఎఱఁ॥)
అట్టె కాఁగిలించుకొంటె ఆయాలు ముట్టుదురా
నెట్టుకొని యిట్టె కరుణించితురుగాక
గుట్టున శ్రీవేంకటేశ కూడినింతి జంకింతురా
చుట్టురికములెల్లాను చూపుదురుగాక

(||pallavi||)
ĕṟam̐ganivām̐ḍavā yemayyā nīvu
maṟavavachchunā melu manniṁturugāga

(||ĕṟam̐||)
sarasamulāḍidenu sāgirivĕṭṭudurā
vŏrasivŏrasi navvudurugāga
śhirasuvaṭṭidene sedula bigiṁturā
karam̐ginamanasudo kaigŏṁdurugāga

(||ĕṟam̐||)
tachchidachchi sūsidenu talavaṁchugŏṁdurā
ichchagiṁchi gakkanam̐ jeyitturugāga
pachchimāḍalāḍidenu parāgu seyudurā
achchamainasanum̐gŏṁḍa laṁṭudurugāga

(||ĕṟam̐||)
aṭṭĕ kām̐giliṁchugŏṁṭĕ āyālu muṭṭudurā
nĕṭṭugŏni yiṭṭĕ karuṇiṁchidurugāga
guṭṭuna śhrīveṁkaḍeśha kūḍiniṁti jaṁkiṁturā
suṭṭurigamulĕllānu sūbudurugāga