ఎరఁగని వారికైతే నేదోసమును లేదు
(॥పల్లవి॥)
ఎరఁగని వారికైతే నేదోసమును లేదు
గురుతైన నీకే పో కొఱతెల్ల విభుఁడా
(॥ఎర॥)
మచ్చికి నిన్నుఁ గూడి మఱచిన నామేను
యిచ్చలనేమిసేతువో యెట్టు దెలుసు
నచ్చులఁ బరులు చూచి నన్ను నవ్వినది యెల్ల
వొచ్చెము నీకే సుమ్మీ వోయి విభుఁడా
(॥ఎర॥)
మొగమోడియున్న నన్ను మొరఁగి యవ్వలనేమి
యెగసక్యము సేతువో యెటు దెలుసు
మగవాని కపటాలు మానుపలేవనియేటి
అగడెల్ల నీదే సుమీ అయ్యా విభుఁడ
(॥ఎర॥)
పలు నీరతులలోన బ్రమసి వుండిన నన్ను
యెలయించేమిసేతువో యెట్టు దెలుసు
అలర శ్రీవేంకటేశ అన్నిటా నన్నుఁ గూడితి
తలవంపు నీదే సుమ్మీ తగదంటే విభుఁడా
(||pallavi||)
ĕram̐gani vārigaide nedosamunu ledu
gurudaina nīge po kŏṟadĕlla vibhum̐ḍā
(||ĕra||)
machchigi ninnum̐ gūḍi maṟasina nāmenu
yichchalanemiseduvo yĕṭṭu dĕlusu
nachchulam̐ barulu sūsi nannu navvinadi yĕlla
vŏchchĕmu nīge summī voyi vibhum̐ḍā
(||ĕra||)
mŏgamoḍiyunna nannu mŏram̐gi yavvalanemi
yĕgasakyamu seduvo yĕḍu dĕlusu
magavāni kabaḍālu mānubalevaniyeḍi
agaḍĕlla nīde sumī ayyā vibhum̐ḍa
(||ĕra||)
palu nīradulalona bramasi vuṁḍina nannu
yĕlayiṁchemiseduvo yĕṭṭu dĕlusu
alara śhrīveṁkaḍeśha anniḍā nannum̐ gūḍidi
talavaṁpu nīde summī tagadaṁṭe vibhum̐ḍā