Eṟamgani vaanivale nippudu vichchesidivi

ఎఱఁగని వానివలె నిప్పుడు విచ్చేసితివి
Language

(॥పల్లవి॥)
ఎఱఁగని వానివలె నిప్పుడు విచ్చేసితివి
గుఱిగా నిన్నియుఁ గనుఁగొనవయ్యా నీవే

(॥ఎఱఁగ॥)
నెలకొని నీవే కావా నేరిపిన నేరుపులే
వలపులతోడి యీవసివాళ్లు
యెలమి నప్పటి మరి యిచ్చిన యీవులే కావా
చెలరేఁగి చెక్కుచేతి చింతలు

(॥ఎఱఁగ॥)
చిత్తగించి నీవే కావా సేసిన చేఁతలివి
చిత్తడి మేనిమీఁది చెమటలు
బత్తితోడ మీఁద మీఁదఁ బాలించినవే కావా
పొత్తుల విరహవేళ పులకలు

(॥ఎఱఁగ॥)
మక్కువతో నీవే కావా మన్నించిన మన్ననలు
వుక్కు మీరినట్టి అసురుసురులు
యిక్కువ శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
చక్కని నీవల్లనేకా సంతసములు

(||pallavi||)
ĕṟam̐gani vānivalĕ nippuḍu vichchesidivi
guṟigā ninniyum̐ ganum̐gŏnavayyā nīve

(||ĕṟam̐ga||)
nĕlagŏni nīve kāvā neribina nerubule
valabuladoḍi yīvasivāḽlu
yĕlami nappaḍi mari yichchina yīvule kāvā
sĕlarem̐gi sĕkkusedi siṁtalu

(||ĕṟam̐ga||)
sittagiṁchi nīve kāvā sesina sem̐talivi
sittaḍi menimīm̐di sĕmaḍalu
battidoḍa mīm̐da mīm̐dam̐ bāliṁchinave kāvā
pŏttula virahaveḽa pulagalu

(||ĕṟam̐ga||)
makkuvado nīve kāvā manniṁchina mannanalu
vukku mīrinaṭṭi asurusurulu
yikkuva śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
sakkani nīvallanegā saṁtasamulu