ఎఱఁగనట్టున్నాఁడవు యేల దాఁచేవు పొందులు
(॥పల్లవి॥)
ఎఱఁగనట్టున్నాఁడవు యేల దాఁచేవు పొందులు
మఱఁగున నింతి నిట్టె మన్నించరాదా
(॥ఎఱఁ॥)
చీటికిమాటికి నాపె సిగ్గులువడీ నీతో
గాలమైన నీదేవులు గాఁబోలును
సూటిదప్పకుండా నిన్నే చూచీ నప్పటి నాపె
బాటగాఁ దమకమెల్లాఁబై కొనఁగబోలును
(॥ఎఱఁ॥)
నానఁబెట్టి ముసిముసినవ్వులు నవ్వీ నాపె
కానీలే నీయెరుకది గాఁబోలును
ఆనుకొని నీమాటలే ఆలకించి వినీ నాపె
వూని తన అసలెల్లా వుప్పొంగఁబోలును
(॥ఎఱఁ॥)
అంది నీవురముమీఁద నటు నెలకొనె నాపె
కందువ నలమేల్మంగ గాఁబోలును
ఇందరిలో శ్రీవేంకటేశ నన్ను నేలితివి
అందాలుచేసీఁదాను అరుదుగాఁబోలును
(||pallavi||)
ĕṟam̐ganaṭṭunnām̐ḍavu yela dām̐sevu pŏṁdulu
maṟam̐guna niṁti niṭṭĕ manniṁcharādā
(||ĕṟam̐||)
sīḍigimāḍigi nābĕ sigguluvaḍī nīdo
gālamaina nīdevulu gām̐bolunu
sūḍidappaguṁḍā ninne sūsī nappaḍi nābĕ
bāḍagām̐ damagamĕllām̐bai kŏnam̐gabolunu
(||ĕṟam̐||)
nānam̐bĕṭṭi musimusinavvulu navvī nābĕ
kānīle nīyĕrugadi gām̐bolunu
ānugŏni nīmāḍale ālagiṁchi vinī nābĕ
vūni tana asalĕllā vuppŏṁgam̐bolunu
(||ĕṟam̐||)
aṁdi nīvuramumīm̐da naḍu nĕlagŏnĕ nābĕ
kaṁduva nalamelmaṁga gām̐bolunu
iṁdarilo śhrīveṁkaḍeśha nannu nelidivi
aṁdālusesīm̐dānu arudugām̐bolunu