ఎఱఁగనట్టే వున్నాఁడ వేమీ నీవు
(॥పల్లవి॥)
ఎఱఁగనట్టే వున్నాఁడ వేమీ నీవు
నెఱయఁ దెరమఱఁగు నీవే తేరుచుమీ
(॥ఎఱఁ॥)
నెలఁతల్లిద్దరిసంది నిజము నిన్నుఁగోరితే
మలకలమలకల మాటలాడేవు
కలది గలట్టె చెప్పు కాఁపురము నిన్ను మోఁచి
తెలిసి కాంతలవాదు తేరుచుమా నీవే
(॥ఎఱఁ॥)
సవతుల శాంతాలజాడలు నిన్నడిగితే
నవకపుసెలవుల నవ్వు నవ్వేవు
వివరించు తప్పొప్పులు వేడుకలు నీసొమ్మే
తివిరి పాడిపంతాలు తేరుచుమా నీవే
(॥ఎఱఁ॥)
సరిఁ బెండ్లికూఁతులను సంతము సేయుమంటే
శిరసెత్తి చూచి చూచి సిగ్గువడేవు
నిరతి శ్రీవేంకటేశ నేరుపెల్లా వీవొళ్లిదే
తిరమై నన్నేలితివి తేరుచుమా నీవే
(||pallavi||)
ĕṟam̐ganaṭṭe vunnām̐ḍa vemī nīvu
nĕṟayam̐ dĕramaṟam̐gu nīve terusumī
(||ĕṟam̐||)
nĕlam̐talliddarisaṁdi nijamu ninnum̐goride
malagalamalagala māḍalāḍevu
kaladi galaṭṭĕ sĕppu kām̐puramu ninnu mom̐si
tĕlisi kāṁtalavādu terusumā nīve
(||ĕṟam̐||)
savadula śhāṁtālajāḍalu ninnaḍigide
navagabusĕlavula navvu navvevu
vivariṁchu tappŏppulu veḍugalu nīsŏmme
tiviri pāḍibaṁtālu terusumā nīve
(||ĕṟam̐||)
sarim̐ bĕṁḍligūm̐tulanu saṁtamu seyumaṁṭe
śhirasĕtti sūsi sūsi sigguvaḍevu
niradi śhrīveṁkaḍeśha nerubĕllā vīvŏḽlide
tiramai nannelidivi terusumā nīve