Eṟamgamu vorusugo yemi galiginaa nannee

ఎఱఁగము వోరుచుకో యేమి గలిగినా నన్నీ
Language

(॥పల్లవి॥)
ఎఱఁగము వోరుచుకో యేమి గలిగినా నన్నీ
తఱివచ్చె పనులలో తప్పుదేరీఁ గాని

(॥ఎఱ॥)
చనవుగలుగువారు సణఁగు లెంతాడినాను
మనసు నాటుకొని మంచిదై తోఁచు
పెనఁగితి నిందాఁకా ప్రియము రెట్టించ నేను
యెనసి నీచిత్తానకు యెట్టుండెనో

(॥ఎఱఁ॥)
పిలిపించుకొన్నవారు బీరము లెంతాడుకొన్నా
వలపుల చేఁతలకు వన్నెలై తోఁచు
మలసితి నిందాఁక మర్మము సోఁకఁగ నిన్ను
వలనై నీచిత్తానకు వచ్చునో రాదో

(॥ఎఱఁ॥)
బాసలు గొనినవారు పట్టి యేమి సేసినాను
వేసట యించుకలేక వేడుకై తోఁచు
యీసులేక శ్రీ వేంకటేశ నేఁ గూడితి నిన్ను
ఆసతో, నీ చిత్తానకు నది మించెనో

(||pallavi||)
ĕṟam̐gamu vorusugo yemi galiginā nannī
taṟivachchĕ panulalo tappuderīm̐ gāni

(||ĕṟa||)
sanavugaluguvāru saṇam̐gu lĕṁtāḍinānu
manasu nāḍugŏni maṁchidai tom̐su
pĕnam̐gidi niṁdām̐kā priyamu rĕṭṭiṁcha nenu
yĕnasi nīsittānagu yĕṭṭuṁḍĕno

(||ĕṟam̐||)
pilibiṁchugŏnnavāru bīramu lĕṁtāḍugŏnnā
valabula sem̐talagu vannĕlai tom̐su
malasidi niṁdām̐ka marmamu som̐kam̐ga ninnu
valanai nīsittānagu vachchuno rādo

(||ĕṟam̐||)
bāsalu gŏninavāru paṭṭi yemi sesinānu
vesaḍa yiṁchugalega veḍugai tom̐su
yīsulega śhrī veṁkaḍeśha nem̐ gūḍidi ninnu
āsado, nī sittānagu nadi miṁchĕno