ఎరఁగము నీ సుద్దులు యిందాఁకాను
(॥పల్లవి॥)
ఎరఁగము నీ సుద్దులు యిందాఁకాను
పెర రేఁపులనే యాస పేరఁ బెట్టేవటవే
(॥ఎరఁ॥)
చుట్ట చుట్టి వచ్చి నీవు చూచే వాతని మోము
పొట్టఁబొరుగున నీకుఁ బొందు గద్దటే
కట్టెదుర నుండి మతి గరఁగేవు సారె సారె
వట్టి మాకు లిగిరించ వలచితివటవే
(॥ఎరఁ॥)
మందలించి మందలించి మాటలాడే వప్పటిని
అందుకొన్న నీ తమక మాఁపలేవటే
విందు చెప్పే నెపమున వేఁడుకొనే విటు వచ్చి
చందమామ గుటుకలు చవిచూపేవటవే
(॥ఎరఁ॥)
నంటు చూపి నంటు చూపి నవ్వేవు సెలవుల
అంటిము ట్టితనికి నీ వాలవటవే
యింటిలో శ్రీవేంకటేశుఁ డేలినాఁడు నన్ను నేఁడు
జంటలైన రతులు తోడంటువెట్టేవటవే
(||pallavi||)
ĕram̐gamu nī suddulu yiṁdām̐kānu
pĕra rem̐pulane yāsa peram̐ bĕṭṭevaḍave
(||ĕram̐||)
suṭṭa suṭṭi vachchi nīvu sūse vādani momu
pŏṭṭam̐bŏruguna nīgum̐ bŏṁdu gaddaḍe
kaṭṭĕdura nuṁḍi madi garam̐gevu sārĕ sārĕ
vaṭṭi māgu ligiriṁcha valasidivaḍave
(||ĕram̐||)
maṁdaliṁchi maṁdaliṁchi māḍalāḍe vappaḍini
aṁdugŏnna nī tamaga mām̐palevaḍe
viṁdu sĕppe nĕbamuna vem̐ḍugŏne viḍu vachchi
saṁdamāma guḍugalu savisūbevaḍave
(||ĕram̐||)
naṁṭu sūbi naṁṭu sūbi navvevu sĕlavula
aṁṭimu ṭṭidanigi nī vālavaḍave
yiṁṭilo śhrīveṁkaḍeśhum̐ ḍelinām̐ḍu nannu nem̐ḍu
jaṁṭalaina radulu toḍaṁṭuvĕṭṭevaḍave