Eṟamgami sesugone videmoyi ne

ఎఱఁగమి చేసుకొనే విదేమోయి నే
Language

(॥పల్లవి॥)
ఎఱఁగమి చేసుకొనే విదేమోయి నే-
మెఱిఁగిన పనులే యిన్నియును నోయీ

(॥ఎఱఁగ॥)
చిగురుమోవిమీఁదఁ జిప్పిలేటిమాటలు
వెగటు లేకాపెచేత వింటివా వోయి
మొగముచూచితేను మొక్కేటిమొక్కులు
అగడుగాఁ గంటివా అదియును నోయి

(॥ఎఱఁగ॥)
కందువతో నీకుఁ జేసే కనుఁగొనసన్నలు
చెంది నీవిప్పుడే చూచితినా వోయి
అందమై సెలవుల నానుకొన్ననవ్వులు
చిందీనవే నీవు తెలిసితివా వోయీ

(॥ఎఱఁగ॥)
పొలుపైన రతులలో బొమ్మల జంకెనలవి
కొలఁది మీరఁగ నియ్యకొంటివా వోయి
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్నునిట్టె
కలసి యాపెగుట్టులు కంటివా వోయీ

(||pallavi||)
ĕṟam̐gami sesugŏne videmoyi ne-
mĕṟim̐gina panule yinniyunu noyī

(||ĕṟam̐ga||)
sigurumovimīm̐dam̐ jippileḍimāḍalu
vĕgaḍu legābĕseda viṁṭivā voyi
mŏgamusūsidenu mŏkkeḍimŏkkulu
agaḍugām̐ gaṁṭivā adiyunu noyi

(||ĕṟam̐ga||)
kaṁduvado nīgum̐ jese kanum̐gŏnasannalu
sĕṁdi nīvippuḍe sūsidinā voyi
aṁdamai sĕlavula nānugŏnnanavvulu
siṁdīnave nīvu tĕlisidivā voyī

(||ĕṟam̐ga||)
pŏlubaina radulalo bŏmmala jaṁkĕnalavi
kŏlam̐di mīram̐ga niyyagŏṁṭivā voyi
yĕlami śhrīveṁkaḍeśha yelidivi nannuniṭṭĕ
kalasi yābĕguṭṭulu kaṁṭivā voyī