ఎఱఁగమైతి మయ్య యిన్నాళ్ళు నేము
(॥పల్లవి॥)
ఎఱఁగమైతి మయ్య యిన్నాళ్ళు నేము
నెఱజాణతనములు నేర్చుకొంటివా
(॥ఎఱ॥)
కన్నుల నాకె నిన్నుఁగనుఁగొని మొక్కితేను
చన్నులమీఁదిపయ్యద జారఁదీసేవు
కన్నియవినయ మేడ కాఁతాళము నది యాడ
యెన్ని చూచితే వీగుణాలు యిటువంటివో
(॥ఎఱ॥)
గక్కన పూవులచెండు కానిక నీ కిచ్చితేను
చక్కెరవంటి మోవి చవిగొనేవు
యిక్కడ నా కె వినయ మెంత నీ వుద్దండ మెంత
యెక్కడ నీ తలుపుఁలు యిటువంటివా
(॥ఎఱ॥)
సందడి నలమేల్మంగ రు నిలుచుంటేను
కందువ శ్రీవేంకటేశ కాఁగిలించేవు
యిందుముఖి సిగ్గులెట్టు యిట్టివి నీచేఁతలెట్టు
యిందరిలో నీవలపు లిటువంటివా
(||pallavi||)
ĕṟam̐gamaidi mayya yinnāḽḽu nemu
nĕṟajāṇadanamulu nersugŏṁṭivā
(||ĕṟa||)
kannula nāgĕ ninnum̐ganum̐gŏni mŏkkidenu
sannulamīm̐dibayyada jāram̐dīsevu
kanniyavinaya meḍa kām̐tāḽamu nadi yāḍa
yĕnni sūside vīguṇālu yiḍuvaṁṭivo
(||ĕṟa||)
gakkana pūvulasĕṁḍu kāniga nī kichchidenu
sakkĕravaṁṭi movi savigŏnevu
yikkaḍa nā kĕ vinaya mĕṁta nī vuddaṁḍa mĕṁta
yĕkkaḍa nī talubum̐lu yiḍuvaṁṭivā
(||ĕṟa||)
saṁdaḍi nalamelmaṁga ru nilusuṁṭenu
kaṁduva śhrīveṁkaḍeśha kām̐giliṁchevu
yiṁdumukhi siggulĕṭṭu yiṭṭivi nīsem̐talĕṭṭu
yiṁdarilo nīvalabu liḍuvaṁṭivā