Eṟamgamaa yimta yemmegaamda

ఎఱఁగమా యింత యెమ్మెకాఁడ
Language

(॥పల్లవి॥)
ఎఱఁగమా యింత యెమ్మెకాఁడ
గుఱి లేని వట్టి కోపకాఁడా

(॥ఎఱగవ॥)
మాయలు నెరపి మంచిమాఁట లాడి
చాయకు వలచే సటకాఁడా
కాయజకేలికి కాలిసన్నగోర
వాయక వాసేపు వగకాఁడా

(॥ఎఱగవ॥)
అట్టు నిట్టు వచ్చి యాసలు రేఁచేవు
పట్టినచలముల పంతగాఁడా
గుట్టు సేసుకొని కూరిమి చల్లేవు
తొట్టినపాయపు దొమ్మికాఁడా

(॥ఎఱగవ॥)
మన్నించి యింతలో మంచ మెక్కితివి
మిన్నక నవ్వుల మేఁటికాఁడా
యిన్నిటా శ్రీవెంకటేశ కూడితిని
కన్నుల మొక్కెటి గండికాఁడా

(||pallavi||)
ĕṟam̐gamā yiṁta yĕmmĕgām̐ḍa
guṟi leni vaṭṭi kobagām̐ḍā

(||ĕṟagava||)
māyalu nĕrabi maṁchimām̐ṭa lāḍi
sāyagu valase saḍagām̐ḍā
kāyajageligi kālisannagora
vāyaga vāsebu vagagām̐ḍā

(||ĕṟagava||)
aṭṭu niṭṭu vachchi yāsalu rem̐sevu
paṭṭinasalamula paṁtagām̐ḍā
guṭṭu sesugŏni kūrimi sallevu
tŏṭṭinabāyabu dŏmmigām̐ḍā

(||ĕṟagava||)
manniṁchi yiṁtalo maṁcha mĕkkidivi
minnaga navvula mem̐ṭigām̐ḍā
yinniḍā śhrīvĕṁkaḍeśha kūḍidini
kannula mŏkkĕḍi gaṁḍigām̐ḍā