Eṟamgamaa neejaada limtaga tolli

ఎఱఁగమా నీజాడ లింతక తొల్లి
Language

(॥పల్లవి॥)
ఎఱఁగమా నీజాడ లింతక తొల్లి
మెఱసితి విట్టె యలమేలుమంగతనము

(॥॥)
సరసమెంతాడేవే చవులెంత చూపేవే
విరులేల చల్లేవే విభునిమీఁద
వరుసకు వచ్చిన వనితలెల్లా నుండఁగా
దొరవైతి విందరిలో తొయ్యలి నీవు

(॥॥)
నవ్వులెందాఁకా నవ్వేవే నాఁట నెంతచూచేవే
రవ్వగాఁ బెనఁగనేలే రమణునితో
జవ్వనపువేడుకతో సవతులెల్లాఁ జూడఁగా
వువ్విళ్లూర నీవితని వుర మెక్కుకొంటివే

(॥॥)
వావులేమి చెప్పేవే వడిగా నెట్టు గూడేవే
యేవేళైనా శ్రీవేంకటేశ్వరుని
సేవసేసి నేమెల్లా సేసవెట్టి పెండ్లాడఁగా
దేవరవలె పట్టపుదేవులవైతివే

(||pallavi||)
ĕṟam̐gamā nījāḍa liṁtaga tŏlli
mĕṟasidi viṭṭĕ yalamelumaṁgadanamu

(||||)
sarasamĕṁtāḍeve savulĕṁta sūbeve
virulela salleve vibhunimīm̐da
varusagu vachchina vanidalĕllā nuṁḍam̐gā
dŏravaidi viṁdarilo tŏyyali nīvu

(||||)
navvulĕṁdām̐kā navveve nām̐ṭa nĕṁtasūseve
ravvagām̐ bĕnam̐ganele ramaṇunido
javvanabuveḍugado savadulĕllām̐ jūḍam̐gā
vuvviḽlūra nīvidani vura mĕkkugŏṁṭive

(||||)
vāvulemi sĕppeve vaḍigā nĕṭṭu gūḍeve
yeveḽainā śhrīveṁkaḍeśhvaruni
sevasesi nemĕllā sesavĕṭṭi pĕṁḍlāḍam̐gā
devaravalĕ paṭṭabudevulavaidive