ఎఱఁగమా నీగుణము ఇంత వింతవారమా
(॥పల్లవి॥)
ఎఱఁగమా నీగుణము ఇంత వింతవారమా
మెఱసి ఇన్నిటా నిన్ను మెచ్చుటింతేకాక
(॥ఎఱ॥)
చనవుగలుగువారు జడియఁగనేమిటికి
మనసెరిఁగినవారు మండాడనేల
కనుసన్ననుండేవారు కాఁతాళించనేమిటికి
ననిచి నీచేఁతలకు నవ్వుటింతేకాక
(॥ఎఱ॥)
తగుదలాయమైనవారు తత్తరించనేమిటికి
మొగమోటయినవారు మొరయనేల
తగవునడపేవారు తప్పించుకోనేమిటికి
సొగిసి నిన్నుఁ దప్పకచూచుటింతేకాక
(॥ఎఱ॥)
గుట్టుతో మెలఁగేవారు కొసరఁగనేమిటికి
చుట్టములైనవారు జుణుఁగనేల
యిట్టె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
చిట్టకములేక సంతోసించుకొంటగాక
(||pallavi||)
ĕṟam̐gamā nīguṇamu iṁta viṁtavāramā
mĕṟasi inniḍā ninnu mĕchchuḍiṁtegāga
(||ĕṟa||)
sanavugaluguvāru jaḍiyam̐ganemiḍigi
manasĕrim̐ginavāru maṁḍāḍanela
kanusannanuṁḍevāru kām̐tāḽiṁchanemiḍigi
nanisi nīsem̐talagu navvuḍiṁtegāga
(||ĕṟa||)
tagudalāyamainavāru tattariṁchanemiḍigi
mŏgamoḍayinavāru mŏrayanela
tagavunaḍabevāru tappiṁchugonemiḍigi
sŏgisi ninnum̐ dappagasūsuḍiṁtegāga
(||ĕṟa||)
guṭṭudo mĕlam̐gevāru kŏsaram̐ganemiḍigi
suṭṭamulainavāru juṇum̐ganela
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
siṭṭagamulega saṁtosiṁchugŏṁṭagāga