Eṟamgamaa nee sudduleppudu nemu

ఎఱఁగమా నీ సుద్దులెప్పుడు నేము
Language

(॥పల్లవి॥)
ఎఱఁగమా నీ సుద్దులెప్పుడు నేము
నెఱవుగా మమ్ము మన్నించక మానేవా

(॥ఎఱఁ॥)
చెప్పరాని మాటలకు చెవియొగ్గేవాఁడవు
కప్పి మమ్ము సుద్ధలడుగక మానేవా
చిప్పిల నెందుకునైనా చేయి చాఁచేవాఁడవు
అప్పటిమాతో సరసాలాడక మానేవా

(॥ఎఱఁ॥)
చూడరాని చోట్లెల్లఁ జూచేటి వాఁడవు
జాడతో మర్మాలు సోదించక మానేవా
చేడెల కందరికిని సేవలు సేసేవాఁడవు
యీడ మాకు నాకు మడిచియ్యక మానేవా

(॥ఎఱఁ॥)
నగరానివారితోడ నవ్వేటివాఁడవు
మగుడ మమ్ముఁ గూడక మఱి మానేవా
యెగసక్కెపు శ్రీవేంకటేశ వూరఁజుట్టమవు
పొగిసి మమ్మేలితివి జోడుగాక మానేవా

(||pallavi||)
ĕṟam̐gamā nī suddulĕppuḍu nemu
nĕṟavugā mammu manniṁchaga mānevā

(||ĕṟam̐||)
sĕpparāni māḍalagu sĕviyŏggevām̐ḍavu
kappi mammu suddhalaḍugaga mānevā
sippila nĕṁdugunainā seyi sām̐sevām̐ḍavu
appaḍimādo sarasālāḍaga mānevā

(||ĕṟam̐||)
sūḍarāni soṭlĕllam̐ jūseḍi vām̐ḍavu
jāḍado marmālu sodiṁchaga mānevā
seḍĕla kaṁdarigini sevalu sesevām̐ḍavu
yīḍa māgu nāgu maḍisiyyaga mānevā

(||ĕṟam̐||)
nagarānivāridoḍa navveḍivām̐ḍavu
maguḍa mammum̐ gūḍaga maṟi mānevā
yĕgasakkĕbu śhrīveṁkaḍeśha vūram̐juṭṭamavu
pŏgisi mammelidivi joḍugāga mānevā