Eṟamgamaa nee laagu yenni vidyala vaamdavu

ఎఱఁగమా నీ లాగు యెన్ని విద్యల వాఁడవు
Language

(॥పల్లవి॥)
ఎఱఁగమా నీ లాగు యెన్ని విద్యల వాఁడవు
వొఱపులు సేసుకొంటా నున్నాఁడవు

(॥ఎఱఁ॥)
చల్లలమ్మేగొల్లెతలు జాజరాడఁ బోలుదురు
అల్లదె నీమేన జిడ్డయి వున్నది
యిల్లిదె తట్టుపునుఁగు యిందుకుఁగాఁ బూసుకొని
వొళ్లల్లా మెఱుఁగు సేసుకున్నాఁడవు

(॥ఎఱఁ॥)
సారె గోపికలెల్లా వసంతమాడఁ బోలుదురు
సారపు నీమేను బూదచరచున్నది
యేరా కప్పురధూళి యిందుకుఁగాఁ బూసుకొని
వోరిచి నెపము వేసుకున్నాఁడవు

(॥ఎఱఁ॥)
సిగ్గుల మందసతులు సేసవెట్టఁ బోలుదురు
అగ్గలమై మేను కళయై వున్నది
నిగ్గుల శ్రీ వేంకటేశ నీ విందుకు నన్నుఁ గూడి
వొగ్గుచు సొమ్ములు నించు కున్నాఁడవు

(||pallavi||)
ĕṟam̐gamā nī lāgu yĕnni vidyala vām̐ḍavu
vŏṟabulu sesugŏṁṭā nunnām̐ḍavu

(||ĕṟam̐||)
sallalammegŏllĕdalu jājarāḍam̐ boluduru
alladĕ nīmena jiḍḍayi vunnadi
yillidĕ taṭṭubunum̐gu yiṁdugum̐gām̐ būsugŏni
vŏḽlallā mĕṟum̐gu sesugunnām̐ḍavu

(||ĕṟam̐||)
sārĕ gobigalĕllā vasaṁtamāḍam̐ boluduru
sārabu nīmenu būdasarasunnadi
yerā kappuradhūḽi yiṁdugum̐gām̐ būsugŏni
vorisi nĕbamu vesugunnām̐ḍavu

(||ĕṟam̐||)
siggula maṁdasadulu sesavĕṭṭam̐ boluduru
aggalamai menu kaḽayai vunnadi
niggula śhrī veṁkaḍeśha nī viṁdugu nannum̐ gūḍi
vŏggusu sŏmmulu niṁchu kunnām̐ḍavu