ఎఱఁగమా మీ రాజస మింతక తొల్లి
(॥పల్లవి॥)
ఎఱఁగమా మీ రాజస మింతక తొల్లి
మఱఁగులు మాని నాతో మాఁటలాడరాదా
(॥ఎఱఁ॥)
మొగము చూచి నేఁడు మొక్కించుకో నెంత లేదు
నగ వెంత లేదు నీకు నలినాక్షితో
తగ నీకు నాపెకును దగ్గరి వచ్చిన యట్టి
మగువను నాతో గొంత మాఁటలాడరాదా
(॥ఎఱఁ॥)
వేడుక నాపెచేఁతకు వెరగంద వెంత లేదు
యీడు జోడుగాఁ బెనఁగ నెంత లేదు
కూడితిరి మీరిద్దరు గురియై నే నింతలో
మాడలు రాలఁగ నాతో మాఁటలాడరాదా
(॥ఎఱఁ॥)
చంచుల సన్నలు సేసి చనవియ్య నెంత లేదు
ఇంచు కించుకే కొసర నెంత లేదు
కొంచక శ్రీ వేంకటేశ కోరి నన్ను నేలితివి
మంచము పైనే నాతో మాఁటలాడరాదా
(||pallavi||)
ĕṟam̐gamā mī rājasa miṁtaga tŏlli
maṟam̐gulu māni nādo mām̐ṭalāḍarādā
(||ĕṟam̐||)
mŏgamu sūsi nem̐ḍu mŏkkiṁchugo nĕṁta ledu
naga vĕṁta ledu nīgu nalinākṣhido
taga nīgu nābĕgunu daggari vachchina yaṭṭi
maguvanu nādo gŏṁta mām̐ṭalāḍarādā
(||ĕṟam̐||)
veḍuga nābĕsem̐tagu vĕragaṁda vĕṁta ledu
yīḍu joḍugām̐ bĕnam̐ga nĕṁta ledu
kūḍidiri mīriddaru guriyai ne niṁtalo
māḍalu rālam̐ga nādo mām̐ṭalāḍarādā
(||ĕṟam̐||)
saṁchula sannalu sesi sanaviyya nĕṁta ledu
iṁchu kiṁchuge kŏsara nĕṁta ledu
kŏṁchaga śhrī veṁkaḍeśha kori nannu nelidivi
maṁchamu paine nādo mām̐ṭalāḍarādā