Eṟamgam danavachchunaa yidivo taanu

ఎఱఁగఁ డనవచ్చునా యిదివో తాను
Language

(॥పల్లవి॥)
ఎఱఁగఁ డనవచ్చునా యిదివో తాను
చెఱఁగు మూసుకొనఁగాఁ జెక్కు నొక్కీ నిదివో

(॥ఎఱుఁగ॥)
నూటికి మొక్కిన చేయి నొసలిపై నుండఁగా
యేటికి నొడఁబరచీ నిప్పుడే తాను
కాటుకకన్నుల నీరు కడలనే వుండఁగా
నాటకపుమాట లాడి నవ్వించీ నదివో

(॥ఎఱుఁగ॥)
కుమ్మరించేటి సిగ్గులు గుబ్బలపై నుండఁగా
యెమ్మెలకుఁ గౌఁగిలించీ నిదివో తాను
అమ్మరో శ్రీవేంకటేశుఁ డలమేలుమంగ నేను
సమ్మతించ ననుఁ గూడి చన విచ్చె నదివో

(||pallavi||)
ĕṟam̐gam̐ ḍanavachchunā yidivo tānu
sĕṟam̐gu mūsugŏnam̐gām̐ jĕkku nŏkkī nidivo

(||ĕṟum̐ga||)
nūḍigi mŏkkina seyi nŏsalibai nuṁḍam̐gā
yeḍigi nŏḍam̐barasī nippuḍe tānu
kāḍugagannula nīru kaḍalane vuṁḍam̐gā
nāḍagabumāḍa lāḍi navviṁchī nadivo

(||ĕṟum̐ga||)
kummariṁcheḍi siggulu gubbalabai nuṁḍam̐gā
yĕmmĕlagum̐ gaum̐giliṁchī nidivo tānu
ammaro śhrīveṁkaḍeśhum̐ ḍalamelumaṁga nenu
sammadiṁcha nanum̐ gūḍi sana vichchĕ nadivo