ఎఱఁగక నిన్నునంటి నిందాఁకాను । నీ
(॥పల్లవి॥)
ఎఱఁగక నిన్నునంటి నిందాఁకాను । నీ-
కెఱుక సేసితి నిఁక నీ వింటికి రావయ్యా
(॥ఎఱఁ॥)
నీమీఁదాఁ దప్పులేదు నిద్దురాఁ గంటికి రాదు
దోమటి నప్పటి నిన్ను దూరకపోదు
దీమసము నాకు లేదు తెగనాడఁగాఁ గాదు
యేమి సేతు నింతట మాయింటికి రావయ్యా
(॥ఎఱఁ॥)
నాకు మోహింతువు నీవు నవ్వులు నా కింపు గావు
దీకొని నిన్నొరయక దిష్టాలు రావు
నీకు మంతనమే తావు నేఁడుమరునమ్ము పూవు
యేకపటములు నేర నింటికి రావయ్యా
(॥ఎఱఁ॥)
తనువు లింతేవేరు తలఁపు లొక్కేతీరు
పనివడి యిఁకను నాపానుపు చేరు
యెనలెక శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
యినుమడించె వలపు యింటికి రావయ్యా
(||pallavi||)
ĕṟam̐gaga ninnunaṁṭi niṁdām̐kānu | nī-
kĕṟuga sesidi nim̐ka nī viṁṭigi rāvayyā
(||ĕṟam̐||)
nīmīm̐dām̐ dappuledu niddurām̐ gaṁṭigi rādu
domaḍi nappaḍi ninnu dūragabodu
dīmasamu nāgu ledu tĕganāḍam̐gām̐ gādu
yemi sedu niṁtaḍa māyiṁṭigi rāvayyā
(||ĕṟam̐||)
nāgu mohiṁtuvu nīvu navvulu nā kiṁpu gāvu
dīgŏni ninnŏrayaga diṣhṭālu rāvu
nīgu maṁtaname tāvu nem̐ḍumarunammu pūvu
yegabaḍamulu nera niṁṭigi rāvayyā
(||ĕṟam̐||)
tanuvu liṁteveru talam̐pu lŏkkedīru
panivaḍi yim̐kanu nābānubu seru
yĕnalĕga śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
yinumaḍiṁchĕ valabu yiṁṭigi rāvayyā