Eṟamgaga kosaridi neddanayyaa

ఎఱఁగక కొసరితి నెడ్డనయ్యా
Language

(॥పల్లవి॥)
ఎఱఁగక కొసరితి నెడ్డనయ్యా
తఱవాత నన్నియును తానే వచ్చీనయ్యా

(॥ఎఱఁగ॥)
తనివి చాలక నిన్నుఁ దగులనాడితిఁ గాక
మనసురానిపనేల మానవయ్యా
చనవు గలిగి నిన్ను సాదించ వచ్చితిఁ గాక
యెనయనిపొందులింకా నేఁటికయ్యా

(॥ఎఱఁగ॥)
నీవే నేనంటాను నేరములెంచితిఁ గాక
వావాత దూరేపనైతే వద్దయ్యా
చేవదేరెఁ బనులంటా చెక్కులు ముట్టితిఁగాక
కైవసము గాకున్న కడమ నాదయ్యా

(॥ఎఱఁగ॥)
మంచివాఁడవంటా నీతో మంతనమాడితిఁ గాక
మంచమెక్కి వాదులేల మానవయ్యా
అంచల శ్రీవేంకటేశ ఆయమంటి కూడితివి
కంచపు మోవిఫలము గంటిమయ్యా

(||pallavi||)
ĕṟam̐gaga kŏsaridi nĕḍḍanayyā
taṟavāda nanniyunu tāne vachchīnayyā

(||ĕṟam̐ga||)
tanivi sālaga ninnum̐ dagulanāḍidim̐ gāga
manasurānibanela mānavayyā
sanavu galigi ninnu sādiṁcha vachchidim̐ gāga
yĕnayanibŏṁduliṁkā nem̐ṭigayyā

(||ĕṟam̐ga||)
nīve nenaṁṭānu neramulĕṁchidim̐ gāga
vāvāda dūrebanaide vaddayyā
sevaderĕm̐ banulaṁṭā sĕkkulu muṭṭidim̐gāga
kaivasamu gāgunna kaḍama nādayyā

(||ĕṟam̐ga||)
maṁchivām̐ḍavaṁṭā nīdo maṁtanamāḍidim̐ gāga
maṁchamĕkki vādulela mānavayyā
aṁchala śhrīveṁkaḍeśha āyamaṁṭi kūḍidivi
kaṁchabu moviphalamu gaṁṭimayyā