ఎఱఁగక దగ్గరితే నెడ్డనందురు
(॥పల్లవి॥)
ఎఱఁగక దగ్గరితే నెడ్డనందురు
వెఱవక నాకిందుకు వివరించు విభుఁడా
(॥ఎఱఁ॥)
నున్నని చెక్కులమీఁద నూఁగరేఁగెఁ బులకలు
సన్నపు చెమట మేన జాలువారెను
అన్నియు నాకుఁగానొ అవ్వల వేరొకతెకొ
యెన్నికవలపు నాకు నెఱిఁగించు విభుఁడా
(॥ఎఱఁ॥)
తెలుపెక్కెఁ గన్నులను తేరకొనప్పటనుండి
కళలెక్కె మోమునను కడుఁగడును
తలఁపు నామీఁద నుందో దవ్వుల నెక్కడనుందో
యెలమి నీవేడుక నాకెఱిఁగించు విభుఁడా
(॥ఎఱఁ॥)
నవ్వులు సెలవులను నారుకొనె మీఁదమీఁద
రవ్వఁగా శ్రీ వేంకటేశ రతిఁ గూడితి
యివ్వల నాపై మన్ననో యెవ్వరైనాఁ జెప్పిరో
పవ్వళించితివి నాపై పచారించు విభుఁడా
(||pallavi||)
ĕṟam̐gaga daggaride nĕḍḍanaṁduru
vĕṟavaga nāgiṁdugu vivariṁchu vibhum̐ḍā
(||ĕṟam̐||)
nunnani sĕkkulamīm̐da nūm̐garem̐gĕm̐ bulagalu
sannabu sĕmaḍa mena jāluvārĕnu
anniyu nāgum̐gānŏ avvala verŏgadĕgŏ
yĕnnigavalabu nāgu nĕṟim̐giṁchu vibhum̐ḍā
(||ĕṟam̐||)
tĕlubĕkkĕm̐ gannulanu teragŏnappaḍanuṁḍi
kaḽalĕkkĕ momunanu kaḍum̐gaḍunu
talam̐pu nāmīm̐da nuṁdo davvula nĕkkaḍanuṁdo
yĕlami nīveḍuga nāgĕṟim̐giṁchu vibhum̐ḍā
(||ĕṟam̐||)
navvulu sĕlavulanu nārugŏnĕ mīm̐damīm̐da
ravvam̐gā śhrī veṁkaḍeśha radim̐ gūḍidi
yivvala nābai mannano yĕvvarainām̐ jĕppiro
pavvaḽiṁchidivi nābai pasāriṁchu vibhum̐ḍā