ఎఱఁగదా నీ మనసు యేల విన్నపము సేయ
(॥పల్లవి॥)
ఎఱఁగదా నీ మనసు యేల విన్నపము సేయ
యెఱుక సేసేవు మాతో నింతేసి వలెనా
(॥ఎఱఁ॥)
పంతమిచ్చి(చ్చే) ఆఁడువారె పాలుమాలితేఁగనక
యెంత చెప్పినాఁ జెల్లు యేతులు నీకు
వంతుతో నీవద్దనుండి వాసికే సేవలు సేసే
అంతరంగమైన మాపై నంతేసి వలెనా
(॥ఎఱఁ॥)
సిగ్గుగలవనితలే చేతులెత్తి మొక్కితేను
వెగ్గళించ నమరును వేవేలు నీకు
యెగ్గులుఁ దప్పులుఁబట్ట కిచ్చకము నీకు నాడే
అగ్గమైన మాపైనే అంతేసి వలెనా
(॥ఎఱఁ॥)
మానాపతి మగువలు మతి గుట్టు విడిచితే
నీ నేరుపులే యంతటా నిలుచు నిందు
పూని శ్రీ వేంకటేశుఁడ భోగించితి నీకాఁగిట
అనుకొన్న మాపైనే అంతేసి వలెనా
(||pallavi||)
ĕṟam̐gadā nī manasu yela vinnabamu seya
yĕṟuga sesevu mādo niṁtesi valĕnā
(||ĕṟam̐||)
paṁtamichchi(sche) ām̐ḍuvārĕ pālumālidem̐ganaga
yĕṁta sĕppinām̐ jĕllu yedulu nīgu
vaṁtudo nīvaddanuṁḍi vāsige sevalu sese
aṁtaraṁgamaina mābai naṁtesi valĕnā
(||ĕṟam̐||)
siggugalavanidale sedulĕtti mŏkkidenu
vĕggaḽiṁcha namarunu vevelu nīgu
yĕggulum̐ dappulum̐baṭṭa kichchagamu nīgu nāḍe
aggamaina mābaine aṁtesi valĕnā
(||ĕṟam̐||)
mānābadi maguvalu madi guṭṭu viḍiside
nī nerubule yaṁtaḍā nilusu niṁdu
pūni śhrī veṁkaḍeśhum̐ḍa bhogiṁchidi nīgām̐giḍa
anugŏnna mābaine aṁtesi valĕnā