Eṟamga vinnavimchidi mippude neegu

ఎఱఁగ విన్నవించితి మిప్పుడే నీకు
Language

(॥పల్లవి॥)
ఎఱఁగ విన్నవించితి మిప్పుడే నీకు
జఱయుచు నాఁడువారు సాహసులు సుమ్మీ

(॥॥)
చెంతల నీవొకతితో చేరి మాఁటలాడఁగాను
వంతుకు మాఁటలాఁడీని వాసికి నీకె
యింతట నీవు గనక యిట్టే ఆదరించకున్నా
యెంత సిగ్గువడునో యెఱఁగము సుమ్మీ

(॥॥)
మరిగిన యాకెవద్ద మరి నీవు గూచుండఁగ
వరుసకుఁ గూచుండె వద్దనే యీకె
యిరవుగా నీవీవేళ నిట్టె మన్నించకున్నా
తరవాతి పనులెట్టో తలపించే సుమ్మీ

(॥॥)
వేడుకకు నీవాకెను వెసఁ గాఁగిలించుకొంటే
యీడుగాఁ దా నిన్నుఁ గూడె యిప్పుడే యీకె
జాడతో శ్రీవేంకటేశ సతి నిట్టే పొందకున్న
పాడిపంతాలెట్టుండునో పచ్చిదేరుఁ జుమ్మీ

(||pallavi||)
ĕṟam̐ga vinnaviṁchidi mippuḍe nīgu
jaṟayusu nām̐ḍuvāru sāhasulu summī

(||||)
sĕṁtala nīvŏgadido seri mām̐ṭalāḍam̐gānu
vaṁtugu mām̐ṭalām̐ḍīni vāsigi nīgĕ
yiṁtaḍa nīvu ganaga yiṭṭe ādariṁchagunnā
yĕṁta sigguvaḍuno yĕṟam̐gamu summī

(||||)
marigina yāgĕvadda mari nīvu gūsuṁḍam̐ga
varusagum̐ gūsuṁḍĕ vaddane yīgĕ
yiravugā nīvīveḽa niṭṭĕ manniṁchagunnā
taravādi panulĕṭṭo talabiṁche summī

(||||)
veḍugagu nīvāgĕnu vĕsam̐ gām̐giliṁchugŏṁṭe
yīḍugām̐ dā ninnum̐ gūḍĕ yippuḍe yīgĕ
jāḍado śhrīveṁkaḍeśha sadi niṭṭe pŏṁdagunna
pāḍibaṁtālĕṭṭuṁḍuno pachchiderum̐ jummī