ఎఱఁగ విన్నవించేను యిప్పుడే నేను
(॥పల్లవి॥)
ఎఱఁగ విన్నవించేను యిప్పుడే నేను
తఱవాతఁ దలఁచుకో తప్పదు మా చేఁతలు
(॥॥)
కొప్పు ముడవఁగఁబోతే కుచములు నాఁటు జేసు-
నప్పు డోరువఁగలవా ఆయముచోటు
చిప్పిల నేఁ జూచితేనే చెమరించె నీమేను
చెప్పి మాచేత సేవలు సేయించుకోఁగలవా
(॥॥)
కుంకుమ వూయఁగఁబోతే గోరికొన దాఁకుఁ జెసు
కొంకక సమ్మతించేవా గుండె దాఁకును
అంకెల మాటాడఁగా నీకట్టే మదనమెత్తె
ఇంక మావూడిగము సేయించుకోనోపేవా
(॥॥)
హరములు గట్టఁబోతే నదె కాఁగిలౌఁజేసు
యీరీతి మారుకొన నిఁక వచ్చునా
యేరా శ్రీ వేంకటేశ ఇంతలో నే కూడితివి
చేరి మాచేతిపనులు చిత్తమువచ్చీనా
(||pallavi||)
ĕṟam̐ga vinnaviṁchenu yippuḍe nenu
taṟavādam̐ dalam̐sugo tappadu mā sem̐talu
(||||)
kŏppu muḍavam̐gam̐bode kusamulu nām̐ṭu jesu-
nappu ḍoruvam̐galavā āyamusoḍu
sippila nem̐ jūsidene sĕmariṁchĕ nīmenu
sĕppi māseda sevalu seyiṁchugom̐galavā
(||||)
kuṁkuma vūyam̐gam̐bode gorigŏna dām̐kum̐ jĕsu
kŏṁkaga sammadiṁchevā guṁḍĕ dām̐kunu
aṁkĕla māḍāḍam̐gā nīgaṭṭe madanamĕttĕ
iṁka māvūḍigamu seyiṁchugonobevā
(||||)
haramulu gaṭṭam̐bode nadĕ kām̐gilaum̐jesu
yīrīdi mārugŏna nim̐ka vachchunā
yerā śhrī veṁkaḍeśha iṁtalo ne kūḍidivi
seri māsedibanulu sittamuvachchīnā