Eṟamga raadu mee guttu yi ttumda valadaa

ఎఱఁగ రాదు మీ గుట్టు యి ట్టుండ వలదా
Language

(॥పల్లవి॥)
ఎఱఁగ రాదు మీ గుట్టు యి ట్టుండ వలదా
అఱమఱపులే కంటి మవ్వల దెలియదు

(॥ఎఱగ॥)
అట్టె నీమొగము చూచి అతివ నవ్విననవ్వు
వట్టి శిగ్గుతో నీ తల వంచినవంపు
దట్టపు వెన్నెలకును తామెర ముకుళించిన
ఆ ట్టాయఁ గాని మాకు నవ్వల దెలియదు

(॥ఎఱగ॥)
చేతి పూవుబంతిఁ గొని చెలియ వేసినవాటు
యీతల నంతలో నీ చె య్యెత్తిన మొక్కూ
ఘాత మరునమ్ములకు గవిశనవలె నాయ
నాతుమలోపల మాకు నవ్వల దెలియదు

(॥ఎఱగ॥)
తరుణి నీమంచానకు దగ్గరి వచ్చినరాక
నిరతి శ్రీవెంకటేశ నీకూటమి
గరిమఁ బాలును నీరు గలసినయ ట్టాయ
ఆరు దందితిమి మాకు నవ్వల దెలయదూ

(||pallavi||)
ĕṟam̐ga rādu mī guṭṭu yi ṭṭuṁḍa valadā
aṟamaṟabule kaṁṭi mavvala dĕliyadu

(||ĕṟaga||)
aṭṭĕ nīmŏgamu sūsi adiva navvinanavvu
vaṭṭi śhiggudo nī tala vaṁchinavaṁpu
daṭṭabu vĕnnĕlagunu tāmĕra muguḽiṁchina
ā ṭṭāyam̐ gāni māgu navvala dĕliyadu

(||ĕṟaga||)
sedi pūvubaṁtim̐ gŏni sĕliya vesinavāḍu
yīdala naṁtalo nī sĕ yyĕttina mŏkkū
ghāda marunammulagu gaviśhanavalĕ nāya
nādumalobala māgu navvala dĕliyadu

(||ĕṟaga||)
taruṇi nīmaṁchānagu daggari vachchinarāga
niradi śhrīvĕṁkaḍeśha nīgūḍami
garimam̐ bālunu nīru galasinaya ṭṭāya
āru daṁdidimi māgu navvala dĕlayadū