ఎఱఁగ నైతి నిందాఁక యింత నీవు జోలిఁ బెట్టే
(॥పల్లవి॥)
ఎఱఁగ నైతి నిందాఁక యింత నీవు జోలిఁ బెట్టే
దెఱుఁగుకో నిన్నుఁ గొల్చే దిందుకొరకా
(॥ఎఱఁగ॥)
మాయదారిమాటలే మాపుదాఁకా నాడి నా
కాయముపై నొరగితే కాఁక మానీనా
ఆయములు సళుపఁగ నాసపడి నీరాక
కీయెడ నేఁ గాచుకున్న దొందుకొరకా
(॥ఎఱఁగ॥)
నాటకపునవ్వులే నవ్వి నాతో వేగించఁగ
తాఁటలు దూఁటలే కాక తాపము మారీనా
కూటమి గలిగె నంటా కోరన సంతోషముతో
యీటున నుండిన దెల్లా నిందుకొరకా
(॥ఎఱఁగ॥)
పెనఁగి వట్టికాఁగిట బిగియించి సారె నా
తనువు నిమిరితేనె తని వయ్యీనా
ఘనుఁడ శ్రీవెంకటేశ గక్కునఁ గూడితి విట్టె
యెన లేని నీ మతకా లిందుకొరకా
(||pallavi||)
ĕṟam̐ga naidi niṁdām̐ka yiṁta nīvu jolim̐ bĕṭṭe
dĕṟum̐gugo ninnum̐ gŏlse diṁdugŏragā
(||ĕṟam̐ga||)
māyadārimāḍale mābudām̐kā nāḍi nā
kāyamubai nŏragide kām̐ka mānīnā
āyamulu saḽubam̐ga nāsabaḍi nīrāga
kīyĕḍa nem̐ gāsugunna dŏṁdugŏragā
(||ĕṟam̐ga||)
nāḍagabunavvule navvi nādo vegiṁcham̐ga
tām̐ṭalu dūm̐ṭale kāga tābamu mārīnā
kūḍami galigĕ naṁṭā korana saṁtoṣhamudo
yīḍuna nuṁḍina dĕllā niṁdugŏragā
(||ĕṟam̐ga||)
pĕnam̐gi vaṭṭigām̐giḍa bigiyiṁchi sārĕ nā
tanuvu nimiridenĕ tani vayyīnā
ghanum̐ḍa śhrīvĕṁkaḍeśha gakkunam̐ gūḍidi viṭṭĕ
yĕna leni nī madagā liṁdugŏragā