Eṟamga minnaallunu yimtadi daanavauda

ఎఱఁగ మిన్నాళ్లును యింతటి దానవౌత
Language

(॥పల్లవి॥)
ఎఱఁగ మిన్నాళ్లును యింతటి దానవౌత
గుఱుతు లన్నియు నేఁడు కూడ పెట్టుకొంటివే

(॥ఎఱఁ॥)
మొలకనవ్వుల ముసగసలు
కలికితనంబుల కనుచూపులు
తలిరు మోవి సన్నల తరితీపులు
నెలతరో నీ వెందు నేరుచుకొంటివే

(॥ఎఱఁ॥)
శిరసు వంపుల చిరుసిగ్గులు
సరసపుఁ జెనకుల చయ్యాటాలు
తురుము సింగారాల మురిపెములు
తరుణిలో యివి నీ వెత్తలఁ దెచ్చుకొంటివే

(॥ఎఱఁ॥)
కదలుఁ జన్నుల గరగరికలు
వుదుట మాఁటలోని వొడఁబాటులు
యిదె శ్రీవేంకటేశుతో యెనయికలు
మదిరాక్షిరో యెట్టు మన్నింపించుకొంటివే

(||pallavi||)
ĕṟam̐ga minnāḽlunu yiṁtaḍi dānavauda
guṟudu lanniyu nem̐ḍu kūḍa pĕṭṭugŏṁṭive

(||ĕṟam̐||)
mŏlaganavvula musagasalu
kaligidanaṁbula kanusūbulu
taliru movi sannala taridībulu
nĕladaro nī vĕṁdu nerusugŏṁṭive

(||ĕṟam̐||)
śhirasu vaṁpula sirusiggulu
sarasabum̐ jĕnagula sayyāḍālu
turumu siṁgārāla muribĕmulu
taruṇilo yivi nī vĕttalam̐ dĕchchugŏṁṭive

(||ĕṟam̐||)
kadalum̐ jannula garagarigalu
vuduḍa mām̐ṭaloni vŏḍam̐bāḍulu
yidĕ śhrīveṁkaḍeśhudo yĕnayigalu
madirākṣhiro yĕṭṭu manniṁpiṁchugŏṁṭive