ఎఱఁగ మిన్నాళ్లు నీ విటువంటివాఁడ వవుట
(॥పల్లవి॥)
ఎఱఁగ మిన్నాళ్లు నీ విటువంటివాఁడ వవుట
ఉఱకలేని గుణము లొక్కటే వేయాయను
(॥ఎఱగ॥)
మంచివానివలెనె మాటలు వెలుచుకొని
పొంచి నవ్వుతాఁ జెప్పేవు పొలఁతికిని
యెంచఁగా నాపె నీకు హితవరురాలు గాని
పంచల వేయఁగ నీకుఁ బగవారమా
(॥ఎఱగ॥)
నామంచముమీఁద నుండి నయముల సట చేసి
కామించి యాపెమీఁదఁ గాలు వేసేవు
ప్రేమ నాపె నీకు సేస పెండ్లికూఁతు రాయఁగాని
నేము వెట్టికి వచ్చిననెలఁతల మైతిమా
(॥ఎఱగ॥)
వురముపై నే నిట్టె వుండఁగా శ్రీవెంకటేశ
కరఁగించి యాసతికిఁ గత చెప్పేవు
యెరవుగా నాపెఁ గూడి యింపుగా నన్నుఁ గూడితి
నిర తలమేల్‌మంగను నేనే మేలుదానాన
(||pallavi||)
ĕṟam̐ga minnāḽlu nī viḍuvaṁṭivām̐ḍa vavuḍa
uṟagaleni guṇamu lŏkkaḍe veyāyanu
(||ĕṟaga||)
maṁchivānivalĕnĕ māḍalu vĕlusugŏni
pŏṁchi navvudām̐ jĕppevu pŏlam̐tigini
yĕṁcham̐gā nābĕ nīgu hidavarurālu gāni
paṁchala veyam̐ga nīgum̐ bagavāramā
(||ĕṟaga||)
nāmaṁchamumīm̐da nuṁḍi nayamula saḍa sesi
kāmiṁchi yābĕmīm̐dam̐ gālu vesevu
prema nābĕ nīgu sesa pĕṁḍligūm̐tu rāyam̐gāni
nemu vĕṭṭigi vachchinanĕlam̐tala maidimā
(||ĕṟaga||)
vuramubai ne niṭṭĕ vuṁḍam̐gā śhrīvĕṁkaḍeśha
karam̐giṁchi yāsadigim̐ gada sĕppevu
yĕravugā nābĕm̐ gūḍi yiṁpugā nannum̐ gūḍidi
nira talamelmaṁganu nene meludānāna