Eṟamga minnaallu nee kiduvamtivi

ఎఱఁగ మిన్నాళ్లు నీ కిటువంటివి
Language

(॥పల్లవి॥)
ఎఱఁగ మిన్నాళ్లు నీ కిటువంటివి
మెఱసి నీ వలపులు మితిమీరెనే

(॥ఎఱఁగ॥)
చెక్కులపై పెఁజెమట చెంపల జారుఁ దురుము
యెక్కడ గలిగెనే యింతి నీకు
ముక్కున నిట్టూరుపులు ముసి ముసి నవ్వులు
అక్కజమైన వింతలు అన్నియునుఁ గంటిమే

(॥ఎఱఁగ॥)
కందువ మోవి కెంపులు కన్నుల కావి వన్నెలు
యెందుండి వచ్చెనే నీకు యింతలోననే
సందడి మోము కళలు చన్నులపై గురుతులు
అందమైన సొబగులు నమరి వుందానవే

(॥ఎఱఁగ॥)
తనువుపై పులకలు తమకపు వసివాడు
కనుపెట్టె నీకు నేఁడు కారణమేమే
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్ను నాపె
మనసొక్కటాయ నీమచ్చిక లీడేరెనే

(||pallavi||)
ĕṟam̐ga minnāḽlu nī kiḍuvaṁṭivi
mĕṟasi nī valabulu midimīrĕne

(||ĕṟam̐ga||)
sĕkkulabai pĕm̐jĕmaḍa sĕṁpala jārum̐ durumu
yĕkkaḍa galigĕne yiṁti nīgu
mukkuna niṭṭūrubulu musi musi navvulu
akkajamaina viṁtalu anniyunum̐ gaṁṭime

(||ĕṟam̐ga||)
kaṁduva movi kĕṁpulu kannula kāvi vannĕlu
yĕṁduṁḍi vachchĕne nīgu yiṁtalonane
saṁdaḍi momu kaḽalu sannulabai gurudulu
aṁdamaina sŏbagulu namari vuṁdānave

(||ĕṟam̐ga||)
tanuvubai pulagalu tamagabu vasivāḍu
kanubĕṭṭĕ nīgu nem̐ḍu kāraṇameme
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnu nābĕ
manasŏkkaḍāya nīmachchiga līḍerĕne