Eṟamga minnaallu mee yiddari saridelunu

ఎఱఁగ మిన్నాళ్ళు మీ యిద్దరి సరితెలును
Language

(॥పల్లవి॥)
ఎఱఁగ మిన్నాళ్ళు మీ యిద్దరి సరితెలును
గుఱుతాయ నేఁడు మాకు గుట్టెల్లాఁ దెలిసెను

(॥ఎఱఁ॥)
మెచ్చి మెచ్చి నీతోను మేలమాడీ సారె సారె
మచ్చిక నీకీపె మేనమామ కూఁతురా
రచ్చలోన నిన్నుఁగడు రాకొట్టి పిలువవచ్చీ
పచ్చిగా నీకెప్పుడూను పాయరాని చుట్టమా

(॥ఎఱఁ॥)
చేరి చేరి బుద్దులెల్లాఁ జెప్పవచ్చీ నీకును
కోరి పెండ్లాడినయట్టి కొలము నాల
కూరిమితో నీవద్దఁ గూచుండి నవ్వులు నవ్వీ
నేరుపుతోఁ దగులైన నేస్తపు జవరాలా

(॥ఎఱఁ॥)
పొంచి పొంచి మోవి తేనె పొత్తు గలసీ నీతో
వంచనతోఁదా నీకు వాడిక కాంతా
యెంచఁగ శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
కొంచక నన్నేలితివి కొమ్మ వేడుకకత్తే

(||pallavi||)
ĕṟam̐ga minnāḽḽu mī yiddari saridĕlunu
guṟudāya nem̐ḍu māgu guṭṭĕllām̐ dĕlisĕnu

(||ĕṟam̐||)
mĕchchi mĕchchi nīdonu melamāḍī sārĕ sārĕ
machchiga nīgībĕ menamāma kūm̐turā
rachchalona ninnum̐gaḍu rāgŏṭṭi piluvavachchī
pachchigā nīgĕppuḍūnu pāyarāni suṭṭamā

(||ĕṟam̐||)
seri seri buddulĕllām̐ jĕppavachchī nīgunu
kori pĕṁḍlāḍinayaṭṭi kŏlamu nāla
kūrimido nīvaddam̐ gūsuṁḍi navvulu navvī
nerubudom̐ dagulaina nestabu javarālā

(||ĕṟam̐||)
pŏṁchi pŏṁchi movi tenĕ pŏttu galasī nīdo
vaṁchanadom̐dā nīgu vāḍiga kāṁtā
yĕṁcham̐ga śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
kŏṁchaga nannelidivi kŏmma veḍugagatte