ఎఱఁగ మిన్నాళ్లదాఁకా నిటువంటి మీ పొందులు
(॥పల్లవి॥)
ఎఱఁగ మిన్నాళ్లదాఁకా నిటువంటి మీ పొందులు
మెఱసి యెప్పడూ నాకు మేలువాఁడవు నీవు
(॥యెఱఁ॥)
వలవని వేసాలతో వావులెల్లాఁ జెప్పీని
సొలసి సొలసి యీపె చుట్టమా నీకు
పలుమారు నీతోడ పచ్చిగానే నవ్వీని
తొలుతనే తనకాలు దొక్కతివా నీవు
(॥యెఱఁ॥)
చనువు సేసుక వచ్చి సరసము లాడీని
గొనకొని మేనమామ కూఁతురా నీకు
చెనకి చెనకి నిన్ను జె(జి?) మ్మిరేఁచీ మాఁటలను
వనిత కేమైనాను వలతువా నీవు
(॥యెఱఁ॥)
కప్పరము నోరికిచ్చి కాఁగిలించ(త?) లిచ్చీని
చెప్పరానఁ బట్టపు దేవులా నీకు
యిప్పడు శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
చెప్పరాని బాసలెల్లాఁ జేసితివా నీవు
(||pallavi||)
ĕṟam̐ga minnāḽladām̐kā niḍuvaṁṭi mī pŏṁdulu
mĕṟasi yĕppaḍū nāgu meluvām̐ḍavu nīvu
(||yĕṟam̐||)
valavani vesālado vāvulĕllām̐ jĕppīni
sŏlasi sŏlasi yībĕ suṭṭamā nīgu
palumāru nīdoḍa pachchigāne navvīni
tŏludane tanagālu dŏkkadivā nīvu
(||yĕṟam̐||)
sanuvu sesuga vachchi sarasamu lāḍīni
gŏnagŏni menamāma kūm̐turā nīgu
sĕnagi sĕnagi ninnu jĕ(ji?) mmirem̐sī mām̐ṭalanu
vanida kemainānu valaduvā nīvu
(||yĕṟam̐||)
kapparamu norigichchi kām̐giliṁcha(ta?) lichchīni
sĕpparānam̐ baṭṭabu devulā nīgu
yippaḍu śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
sĕpparāni bāsalĕllām̐ jesidivā nīvu