Eṟamga minnaalladaamkaa meege suddulu

ఎఱఁగ మిన్నాళ్ళదాఁకా మీకె సుద్దులు
Language

(॥పల్లవి॥)
ఎఱఁగ మిన్నాళ్ళదాఁకా మీకె సుద్దులు
మెఱసె నీ కాఁపురము మేలయ్య నీకు

(॥ఎఱఁ॥)
నెక్కొని యీకె బత్తితో ని న్నింటికిఁ బిలిచీని
చిక్కించుక నీకు విందు చెప్పీఁ దాను
పెక్కువినయాలతోడఁ బెనఁగీఁ జేతులు వట్టి
చొక్కముగ నెన్నాళ్ళ చుట్టమోకాని

(॥ఎఱఁ॥)
సరుసఁ గూచుండి తన చనవులు నెరపీని
వరుసవెట్టుక నవ్వవచ్చీ నీతోను
విరులు ముడిచీ నీకు వీఁపునఁ జన్నులు మోవ
సొరది దా నెటువంటి చుట్టమోకాని

(॥ఎఱఁ॥)
తొలుసారె నీమోము తొంగి తొంగి చూచీని
కలికితనాల మొక్కి కాఁగిలించీని
యెలమి శ్రీవేంకటేశ ఇట్టె నన్ను నేలితిని
సొలసీఁ దానూ నెంత చుట్టమోకాని

(||pallavi||)
ĕṟam̐ga minnāḽḽadām̐kā mīgĕ suddulu
mĕṟasĕ nī kām̐puramu melayya nīgu

(||ĕṟam̐||)
nĕkkŏni yīgĕ battido ni nniṁṭigim̐ bilisīni
sikkiṁchuga nīgu viṁdu sĕppīm̐ dānu
pĕkkuvinayāladoḍam̐ bĕnam̐gīm̐ jedulu vaṭṭi
sŏkkamuga nĕnnāḽḽa suṭṭamogāni

(||ĕṟam̐||)
sarusam̐ gūsuṁḍi tana sanavulu nĕrabīni
varusavĕṭṭuga navvavachchī nīdonu
virulu muḍisī nīgu vīm̐punam̐ jannulu mova
sŏradi dā nĕḍuvaṁṭi suṭṭamogāni

(||ĕṟam̐||)
tŏlusārĕ nīmomu tŏṁgi tŏṁgi sūsīni
kaligidanāla mŏkki kām̐giliṁchīni
yĕlami śhrīveṁkaḍeśha iṭṭĕ nannu nelidini
sŏlasīm̐ dānū nĕṁta suṭṭamogāni