Eṟamga mimta vegalivavuda imtagaalamu ninnum bemchidi

ఎఱఁగ మింత వెకలివవుత ఇంతగాలము నిన్నుఁ బెంచితి
Language

(॥పల్లవి॥)
ఎఱఁగ మింత వెకలివవుత ఇంతగాలము నిన్నుఁ బెంచితి
గుఱుతు లెన్నఁడుఁ గాన మిపుడు కొత్తలాయనే

(॥ఎఱఁ॥)
ముక్కుచెరమల నిట్టూర్పులు ముంచి చన్నులమీఁదఁబొలయఁగ
చెక్కిటి చెమటలు గోరికొనలనుఁ జిమ్ముకొంటాను
చిక్కులుదేరిన నెరుల పాపట చేత నొయ్యనే వొయ్యనదువ్వుచు
యెక్కడనుండి వచ్చేవే చెలియ యెంతబిన్నాణివే

(॥ఎఱఁ॥)
వీడియు వీడని తురుములోని విరులు మెల్లనెరాలఁగాను
చోడుముట్టుచు వీనుల జవ్వాది సొరిది జారఁగా
వాడిన చిగురుమోవిమీఁది వన్నెలు చేత నదుముకొనుచు
యేడనుండి వచ్చేవే చెలియ యెంత వొయ్యారివే

(॥ఎఱఁ॥)
మేలిమి పులక జాజిననలు మేనునిండ జాజుకొనఁగ
వాలుఁగన్నులకెంపుడాలు వలపు దెలుపఁగా
యీలీలఁ జనవులొసఁగి శ్రీ వేంకటేశుఁడు నినుఁగూడఁబోలు
యేల ఇంక బొంకులునెరప నెంతబిత్తరివే

(||pallavi||)
ĕṟam̐ga miṁta vĕgalivavuda iṁtagālamu ninnum̐ bĕṁchidi
guṟudu lĕnnam̐ḍum̐ gāna mibuḍu kŏttalāyane

(||ĕṟam̐||)
mukkusĕramala niṭṭūrbulu muṁchi sannulamīm̐dam̐bŏlayam̐ga
sĕkkiḍi sĕmaḍalu gorigŏnalanum̐ jimmugŏṁṭānu
sikkuluderina nĕrula pābaḍa seda nŏyyane vŏyyanaduvvusu
yĕkkaḍanuṁḍi vachcheve sĕliya yĕṁtabinnāṇive

(||ĕṟam̐||)
vīḍiyu vīḍani turumuloni virulu mĕllanĕrālam̐gānu
soḍumuṭṭusu vīnula javvādi sŏridi jāram̐gā
vāḍina sigurumovimīm̐di vannĕlu seda nadumugŏnusu
yeḍanuṁḍi vachcheve sĕliya yĕṁta vŏyyārive

(||ĕṟam̐||)
melimi pulaga jājinanalu menuniṁḍa jājugŏnam̐ga
vālum̐gannulagĕṁpuḍālu valabu dĕlubam̐gā
yīlīlam̐ janavulŏsam̐gi śhrī veṁkaḍeśhum̐ḍu ninum̐gūḍam̐bolu
yela iṁka bŏṁkulunĕraba nĕṁtabittarive