ఎఱఁగ మెన్నఁడు నేము ఇటువంటివి
(॥పల్లవి॥)
ఎఱఁగ మెన్నఁడు నేము ఇటువంటివి
జరపు నివెల్లాఁ జూచి సంతోసము లాయను
(॥ఎఱ॥)
చెనకి యొకతె నిన్నుఁ జెయి వట్టి తియ్యఁగాను
ననచి యొకతెకు సన్నలు సేసేవు
వనిత జాణతనమో వడి నీజాణతనమో
అనుమానమెల్లాఁ దీర నానతీవయ్యా
(॥ఎఱ॥)
యిచ్చలఁ దొల్లిటి యాపె యిటు నీతో మాటాడఁగా
మచ్చిక నవ్వనియాపె మర్మా లంటేవు
నెచ్చెలివలపుజాడో నీవలపుజాడో యిది
అచ్చలాన నాతో నీవు ఆనతీవయ్యా
(॥ఎఱ॥)
చేరి పెండ్లికూఁతురు సేసలు వెట్టఁగాను
సారెఁ జేతు లిద్దరిపైఁ జాచ వచ్చేవు
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
ఆరసి నేఁ జేసేపను లానతీవయ్యా
(||pallavi||)
ĕṟam̐ga mĕnnam̐ḍu nemu iḍuvaṁṭivi
jarabu nivĕllām̐ jūsi saṁtosamu lāyanu
(||ĕṟa||)
sĕnagi yŏgadĕ ninnum̐ jĕyi vaṭṭi tiyyam̐gānu
nanasi yŏgadĕgu sannalu sesevu
vanida jāṇadanamo vaḍi nījāṇadanamo
anumānamĕllām̐ dīra nānadīvayyā
(||ĕṟa||)
yichchalam̐ dŏlliḍi yābĕ yiḍu nīdo māḍāḍam̐gā
machchiga navvaniyābĕ marmā laṁṭevu
nĕchchĕlivalabujāḍo nīvalabujāḍo yidi
achchalāna nādo nīvu ānadīvayyā
(||ĕṟa||)
seri pĕṁḍligūm̐turu sesalu vĕṭṭam̐gānu
sārĕm̐ jedu liddaribaim̐ jāsa vachchevu
yīrīdi śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
ārasi nem̐ jesebanu lānadīvayyā