ఎఱఁగ జెప్పితి నీకు యేకతమైనప్పుడే
(॥పల్లవి॥)
ఎఱఁగ జెప్పితి నీకు యేకతమైనప్పుడే
మఱి యింక నామాట మఱవకుమీ
(॥ఎఱ॥)
వాసి వంతులను నీకు వలచి మాటలాడుదు
వేసరక విమీ వేమారును
సేసుకొన్న యాలను చెయివట్టి నిన్నుఁ దీతు
చేసూటినే రమ్మీ చెలఁగి మాయింటికి
(॥ఎఱ॥)
మేలుదానవై నీమోమే సారెకునుఁ జూతు
తాలిమితో నిలువుమీ తనివారను
యేలుకొమ్మనుచు నిన్ను నిక్కువ లంటినప్పుడు
చాలా మన్నించి నాచనవు చెల్లించుమీ
(॥ఎఱ॥)
సరుస నుండి నీమోవిచవులు చూడఁగోరుదు
గరిమ నాకు నొసఁగి కరుణించుమీ
అరుదై శ్రీవేంకటేశ అలమేల్‌మంగపతివి
మరిగితిఁ గూడితివి మన్నించు మెపుడూ
(||pallavi||)
ĕṟam̐ga jĕppidi nīgu yegadamainappuḍe
maṟi yiṁka nāmāḍa maṟavagumī
(||ĕṟa||)
vāsi vaṁtulanu nīgu valasi māḍalāḍudu
vesaraga vimī vemārunu
sesugŏnna yālanu sĕyivaṭṭi ninnum̐ dīdu
sesūḍine rammī sĕlam̐gi māyiṁṭigi
(||ĕṟa||)
meludānavai nīmome sārĕgunum̐ jūdu
tālimido niluvumī tanivāranu
yelugŏmmanusu ninnu nikkuva laṁṭinappuḍu
sālā manniṁchi nāsanavu sĕlliṁchumī
(||ĕṟa||)
sarusa nuṁḍi nīmovisavulu sūḍam̐gorudu
garima nāgu nŏsam̐gi karuṇiṁchumī
arudai śhrīveṁkaḍeśha alamelmaṁgabadivi
marigidim̐ gūḍidivi manniṁchu mĕbuḍū