Eṟamga gollabadusa nillu gaasugumdagaanu

ఎఱఁగ గొల్లపడుచ నిల్లు గాచుకుండగాను
Language

(॥పల్లవి॥)
ఎఱఁగ గొల్లపడుచ నిల్లు గాచుకుండగాను
మఱి కృష్ణుఁడు వచ్చి నామయి చెమరింపించెనే

(॥॥)
పాపట దువ్వేనంటా బాసికము గట్టినాఁడే
చాఁపేనంటాఁ జేత సేసలు చల్లేనే
కాఁపురాలు సేతమని కాఁగిటించుకొనెనే
మాపుదాఁకా నేమో సేసి మనసు గరఁచెనే

(॥॥)
కై దండ వట్టేనంటా కంకణము గట్టెనే
జూదాలాడేనంటా రొమ్ముచొటు గీరెనే
సోదించేనంటా వొడి చూపుమని పట్టెనే
పోదిసేసి వేగినంతా పులకలు రేఁచెనే

(॥॥)
మొగము చూపు మనుచు మోవిపొత్తు గలసెనే
నగేనంటా బిగ్గెఁబట్టి నా మెక్కించెనే
చిగురుఁబడుకమీఁద శ్రీ వేంకటేశుఁడు
తగురువలె మాఁటాడి తలఁపు చొక్కించెనే

(||pallavi||)
ĕṟam̐ga gŏllabaḍusa nillu gāsuguṁḍagānu
maṟi kṛṣhṇum̐ḍu vachchi nāmayi sĕmariṁpiṁchĕne

(||||)
pābaḍa duvvenaṁṭā bāsigamu gaṭṭinām̐ḍe
sām̐penaṁṭām̐ jeda sesalu sallene
kām̐purālu sedamani kām̐giḍiṁchugŏnĕne
mābudām̐kā nemo sesi manasu garam̐sĕne

(||||)
kai daṁḍa vaṭṭenaṁṭā kaṁkaṇamu gaṭṭĕne
jūdālāḍenaṁṭā rŏmmusŏḍu gīrĕne
sodiṁchenaṁṭā vŏḍi sūbumani paṭṭĕne
podisesi veginaṁtā pulagalu rem̐sĕne

(||||)
mŏgamu sūbu manusu movibŏttu galasĕne
nagenaṁṭā biggĕm̐baṭṭi nā mĕkkiṁchĕne
sigurum̐baḍugamīm̐da śhrī veṁkaḍeśhum̐ḍu
taguruvalĕ mām̐ṭāḍi talam̐pu sŏkkiṁchĕne