Eṟagani yaamtadaani nemta sesevu

ఎఱగని యాఁటదాని నెంత సేసేవు
Language

(॥పల్లవి॥)
ఎఱగని యాఁటదాని నెంత సేసేవు
వెఱగయ్యీ మాకు నీ విధములు చూచి

(॥॥)
మట్టుమీఱ నవ్వునవ్వి మానముపైఁ జేయి వేసి
ఱట్టులు సేసేవుగా మెఱయ నింతిని
దిట్టమాటలాడి మోవితేనెల చవులు చూపి
యెట్టు బ్రమయించేవు యింతలో నీవు

(॥॥)
సారె సారె గోరనూఁది జవ్వనము పెడరేఁచి
అరితేరి నవ్వేవుగా అంగనను
నేరుపులు వచరించి నెట్టుకొని కొంగువట్టి
యీరీతినేల పఱచే విదివో నీవు

(॥॥)
చన్నులంట గాఁగిలించి సరసములాడి యాడి
యెన్నిరతులఁ గూడేవు యీకన్నె నీవు
నన్ను శ్రీవేంకటేశుఁడ నమ్మించి యేలితివి
మన్నించి యెంత మెచ్చేవు మమ్మునిట్టే నీవు

(||pallavi||)
ĕṟagani yām̐ṭadāni nĕṁta sesevu
vĕṟagayyī māgu nī vidhamulu sūsi

(||||)
maṭṭumīṟa navvunavvi mānamubaim̐ jeyi vesi
ṟaṭṭulu sesevugā mĕṟaya niṁtini
diṭṭamāḍalāḍi movidenĕla savulu sūbi
yĕṭṭu bramayiṁchevu yiṁtalo nīvu

(||||)
sārĕ sārĕ goranūm̐di javvanamu pĕḍarem̐si
arideri navvevugā aṁgananu
nerubulu vasariṁchi nĕṭṭugŏni kŏṁguvaṭṭi
yīrīdinela paṟase vidivo nīvu

(||||)
sannulaṁṭa gām̐giliṁchi sarasamulāḍi yāḍi
yĕnniradulam̐ gūḍevu yīgannĕ nīvu
nannu śhrīveṁkaḍeśhum̐ḍa nammiṁchi yelidivi
manniṁchi yĕṁta mĕchchevu mammuniṭṭe nīvu